Telugu Global
Cinema & Entertainment

పోస్టర్ కాపీకొట్టేసిన రాజమౌళి 

విడుదల చేసింది ఒకే ఒక్క పోస్టర్. అది కూడా అఫీషియల్ గా మొట్టమొదటి పోస్టర్. ఆ ఒక్క పోస్టర్ నుంచే విమర్శలు షురూ చేశాడు దర్శకుడు రాజమౌళి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్ పై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో హాలీవుడ్ లో వచ్చిన ఓ ఇంగ్లిష్ సినిమా పోస్టర్ ను మక్కికి మక్కి దించేసి.. బాహుబలి సినిమా నయా పోస్టర్ ను విడుదల చేశారంటూ విమర్శలు ఊపందుకున్నాయి. 1998లో వచ్చిన కామెడీ […]

పోస్టర్ కాపీకొట్టేసిన రాజమౌళి 
X
విడుదల చేసింది ఒకే ఒక్క పోస్టర్. అది కూడా అఫీషియల్ గా మొట్టమొదటి పోస్టర్. ఆ ఒక్క పోస్టర్ నుంచే విమర్శలు షురూ చేశాడు దర్శకుడు రాజమౌళి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్ పై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో హాలీవుడ్ లో వచ్చిన ఓ ఇంగ్లిష్ సినిమా పోస్టర్ ను మక్కికి మక్కి దించేసి.. బాహుబలి సినిమా నయా పోస్టర్ ను విడుదల చేశారంటూ విమర్శలు ఊపందుకున్నాయి. 1998లో వచ్చిన కామెడీ డ్రామా సిమోన్ బిర్చ్ సినిమా పోస్టర్, తాజాగా విడుదలైన బాహుబలి సినిమా పోస్టర్ ఒక్కటే. నిజానికి బాహుబలి సినిమా ప్రారంభం నుంచి ఈ విమర్శలు వస్తూనే ఉన్నాయి. అప్పట్లో మేకింగ్ వీడియోలు విడుదల చేసినప్పుడు కూడా ఇలాంటిదే ప్రచారం జరిగింది. మేకింగ్ వీడియో థీమ్ ను జక్కన్న కాపీకొట్టాడంటూ విమర్శలొచ్చాయి. అయితే అది ఆన్ లైన్ లో అమ్మకానికి ఉంటుందని, ఎవరైనా కొనుక్కొని దాన్ని ఉపయోగించుకోవచ్చంటూ అప్పట్లో బాహుబలి టీం వివరణ ఇచ్చింది. గతంలో కూడా ఈగ సినిమా పోస్టర్లు, హాలీవుడ్ లో వచ్చిన కాక్రోచ్ సినిమాను పోలి ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. మరి నయా పోస్టర్ కు సంబంధించి రాజమౌళి ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి.
ఏదిఏమైనా ద‌ర్శ‌కుడి ఆలోచ‌న విధాన‌మే అత‌ని డిజైన్ చేసే క్యారెక్ట‌ర్స్ లో ప్ర‌తిబింబిస్తుంది. తాజాగా రాజ‌మౌళి విడుద‌ల చేసిన బాహుబ‌లి పోస్ట‌ర్ ఆయ‌న ఆలోచ‌న విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అంటున్నారు జ‌క్క‌న్న స‌న్నిహితులు. నీటి ప్ర‌వ‌హాంలో కొట్ట‌కు పోతున్న ఒక ప‌సిబిడ్డ ను గాజుల చెయ్యి ఎత్తి ప‌ట్టుకుంది. ఈ పోస్ట‌ర్ ను సోష‌ల్ నెట్ వ‌ర్క్ లోపోస్ట్ చేసి రాజమౌళి ఒక ఆస‌క్తి క‌ర‌మైన ట్విట్ చేశారు. ఏది ఎదురైన గమ్యం చేరుకోవాల్సిందే అని చేశారు. నిజంగా ఆయ‌న ఆలోచ‌న విధానాని ఇది ప్ర‌తిబింబిస్తుంది. ఎందుకుంటే ఆయ‌న ఏప‌ని త‌ల పెట్టిన ఎన్ని అవంత‌రాలు ఎదురైన విజ‌యవంతంగా పూర్తి చేయ‌గ‌ల ప్ర‌తిభాశాలి.
First Published:  2 May 2015 4:39 AM GMT
Next Story