Telugu Global
Others

లోకేష్ అమెరికా యాత్ర ఏ హోదాలో ?

హైద‌రాబాద్: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు త‌న‌యుడు లోకేష్‌బాబు అమెరికా వెళుతున్న‌ట్టు చెబుతున్నారు. ఆయ‌న వెళ్ళేది అధికారికంగా. ఎందుకంటే ఆయ‌న అక్క‌డ 7వ తేదీన అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామాను క‌లుస్తున్నాన‌ని చెప్పారు. అలాగే టెక్సాస్ గ‌వ‌ర్న‌ర్‌ను కూడా క‌లుస్తున్నారు. అమెరికాలో ఆరు న‌గ‌రాల‌ను సంద‌ర్శించి వాటి స్థితిగ‌తుల‌ను ప‌రిశీలించి ఏపీలో వాటి ఆన‌వాళ్ళు క‌నిపించేలా చేస్తార‌ట. అక్క‌డ ఉన్న ప్ర‌వాసాంధ్రుల్లో కొంత‌మంది మంచి స్నేహితులున్నార‌ట‌. వారంతా 250 గ్రామాలు ద‌త్త‌త తీసుకునేందుకు ముందుకొచ్చార‌ట. అలాకాదు… ఓ 500 […]

లోకేష్ అమెరికా యాత్ర ఏ హోదాలో ?
X
హైద‌రాబాద్: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు త‌న‌యుడు లోకేష్‌బాబు అమెరికా వెళుతున్న‌ట్టు చెబుతున్నారు. ఆయ‌న వెళ్ళేది అధికారికంగా. ఎందుకంటే ఆయ‌న అక్క‌డ 7వ తేదీన అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామాను క‌లుస్తున్నాన‌ని చెప్పారు. అలాగే టెక్సాస్ గ‌వ‌ర్న‌ర్‌ను కూడా క‌లుస్తున్నారు. అమెరికాలో ఆరు న‌గ‌రాల‌ను సంద‌ర్శించి వాటి స్థితిగ‌తుల‌ను ప‌రిశీలించి ఏపీలో వాటి ఆన‌వాళ్ళు క‌నిపించేలా చేస్తార‌ట. అక్క‌డ ఉన్న ప్ర‌వాసాంధ్రుల్లో కొంత‌మంది మంచి స్నేహితులున్నార‌ట‌. వారంతా 250 గ్రామాలు ద‌త్త‌త తీసుకునేందుకు ముందుకొచ్చార‌ట. అలాకాదు… ఓ 500 గ్రామ‌ల‌ను ద‌త్త‌త తీసుకోండి అని లోకేష్ అడుగుతున్నారు. బ‌హుశా వాళ్ళూ ఓకే చెప్పొచ్చు. ఎందుకంటే అడిగేది ముఖ్య‌మంత్రి త‌న‌యుడు క‌దా!
ఇంకో విష‌యం ఏమిటంటే… 1500 కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ప్ర‌వాసాంధ్రులు కూడా ముందుకొస్తున్నార‌ని లోకేష్ చెబుతున్నారు. ఈ పెట్టుబ‌డులు కొత్త‌గా నిర్మించే రాజ‌ధానిలో కాబ‌ట్టి… మీకు లాభం కూడా ఎక్కువే ఉంటుంది కాబ‌ట్టి… దీన్ని మ‌రికాస్త పెంచ‌మ‌ని అడుగేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట. ఈ విష‌యాల‌న్నీ లోకేషే శ‌నివారం మీడియా ప్ర‌తినిధుల‌తో చిట్‌చాట్ చేస్తూ చెప్పేశారు. స‌రే ఇవ‌న్నీ బాగానే ఉన్నాయి… ఆంధ్ర‌ప్ర‌దేశ్ మీ వంతు స‌హ‌కారం అందిస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్! కాని మీరు ఏ హోదాలో అక్క‌డికి వెళ్ళి అమెరికా అధ్య‌క్షుడు ఒబామాను, టెక్సాస్ గ‌వ‌ర్న‌ర్‌ని క‌లుస్తున్నారు? మీకు ఎంత ఖ‌ర్చ‌వుతుంది? దీన్ని ఎవ‌రు భ‌రిస్తున్నారు? మీతో వ‌చ్చే ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ డైరెక్ట‌ర్ కార్తికేయ మిశ్రా, సీఎంఓ ఆఫీసు ఓఎస్‌డీ అభీష్ట మీతో వ‌స్తున్న‌ట్టు స‌మాచారం. వారి ఖ‌ర్చుల‌ను ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌, ఐటీ శాఖ భ‌రిస్తున్న‌ట్టు వార్త‌లు… మీతో వ‌స్తుంటే వారి ఖ‌ర్చుల‌ను ప్ర‌భుత్వం భ‌రించ‌డం ఏమిటి? మీరు ప్ర‌భుత్వం త‌ర‌ఫున వెళుతున్నారా? పార్టీ త‌ర‌ఫున వెళుతున్నారా? తెలుసుకోవాల‌ని ముచ్చ‌ట ప‌డుతున్నారు జ‌నం… కొంచెం ఆ వివ‌రాలు కూడా చెబుతారా?… ప‌్లీజ్! -పీఆర్‌
First Published:  2 May 2015 11:16 AM GMT
Next Story