Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 71

లావుపాటి స్త్రీ త‌న స్నేహితురాలితో…  ఆ వేయింగ్ మిష‌న్ (బ‌రువు తెలిపే మిష‌న్‌) అంటే నాకు చాలా చిరాకు, దాని ద‌గ్గ‌ర‌కు వెళ్లాలంటే నాకిష్ట‌ముండ‌దు? స్నేహితురాలు – ఏమిటి? ఎందుక‌ని? లావుపాటి స్త్రీ – నేను బ‌రువు తెలుసుకోవాల‌ని దానిపైన నిల్చున్న‌ప్పుడ‌ల్లా వ‌న్ ప‌ర్స‌న్ ఎట్ వ‌న్ టైం (ఒక‌సారికి ఒక మ‌నిషే) అంటుంది! ————————————– మ‌మ్మీ! తలుపు తెరువు నేను ప‌నిలో ఉన్నాను మీ నాన్నని పిలువు త‌లుపు కొడుతున్న‌ది నాన్నే! ————————————— అవినాష్ జామ్ […]

లావుపాటి స్త్రీ త‌న స్నేహితురాలితో…
ఆ వేయింగ్ మిష‌న్ (బ‌రువు తెలిపే మిష‌న్‌) అంటే నాకు చాలా చిరాకు, దాని ద‌గ్గ‌ర‌కు వెళ్లాలంటే నాకిష్ట‌ముండ‌దు?
స్నేహితురాలు – ఏమిటి? ఎందుక‌ని?
లావుపాటి స్త్రీ – నేను బ‌రువు తెలుసుకోవాల‌ని దానిపైన నిల్చున్న‌ప్పుడ‌ల్లా వ‌న్ ప‌ర్స‌న్ ఎట్ వ‌న్ టైం (ఒక‌సారికి ఒక మ‌నిషే) అంటుంది!
————————————–
మ‌మ్మీ! తలుపు తెరువు
నేను ప‌నిలో ఉన్నాను మీ నాన్నని పిలువు
త‌లుపు కొడుతున్న‌ది నాన్నే!
—————————————
అవినాష్ జామ్ బాటిల్ ఖాళీ చేశాడు
కాసేప‌టికి క‌డుపు నొప్పి మొద‌లైంది
క‌డుపంతా బాధ‌గా ఉందా? అని అడిగింది త‌ల్లి
లేదు మ‌మ్మీ బాధంతా క‌డుపులో ఉంది. అన్నాడు అవినాష్‌
—————————————
బ‌స్సులో ఒక లావుపాటి స్త్రీ సీట్లో కూర్చుంది. ఆమె ఎదురుగా ఒక‌త‌ను కూర్చున్నాడు. సీట్లు లేక ముగ్గురు స్త్రీలు నిల్చున్నారు. బ‌స్సు క‌దిలింది. లావుపాటి స్త్రీ ఎదురు సీట్లో ఉన్న అత‌ని చూసి నీకు మ‌ర్యాద తెలిస్తే నువ్వు లేస్తే నిల్చున్న స్త్రీల‌లో ఒక‌రు కూర్చుంటారు క‌దా! అంది.
అత‌నికి మండింది
నువ్వు మ‌ర్యాద స్త్రీ ఐతే నువ్వు లేస్తే ముగ్గురూ కూర్చుంటారు అన్నాడు
First Published:  1 May 2015 7:15 PM GMT
Next Story