Telugu Global
Cinema & Entertainment

నెక్ట్స్ వచ్చేది శివుడే

బాహుబలికి సంబంధించి ఒకే ఒక్క పోస్టర్ తో టాలీవుడ్ ను షేక్ చేశాడు రాజమౌళి. హీరోహీరోయిన్లు ఎవరూ కనిపించకపోయినప్పటికీ బాహుబలి తొట్టతొలి పోస్టర్ సంచలనం సృష్టించింది. ఈ ఉత్సాహంతో తన రెండో సినిమా పోస్టర్ రిలీజ్ డేట్ ను ప్రకటించాడు జక్కన్న. మరో రెండు రోజుల్లో అంటే మే 4న బాహుబలికి సంబంధించి రెండో పోస్టర్ విడుదల చేస్తానని ప్రకటించాడు. ఆ పోస్టర్ ఏంటనే విషయాన్ని కూడా ముందే చెప్పేశాడు. సినిమాలో రాజమౌళి పోషించిన శివుడు పాత్రకు […]

నెక్ట్స్ వచ్చేది శివుడే
X
బాహుబలికి సంబంధించి ఒకే ఒక్క పోస్టర్ తో టాలీవుడ్ ను షేక్ చేశాడు రాజమౌళి. హీరోహీరోయిన్లు ఎవరూ కనిపించకపోయినప్పటికీ బాహుబలి తొట్టతొలి పోస్టర్ సంచలనం సృష్టించింది. ఈ ఉత్సాహంతో తన రెండో సినిమా పోస్టర్ రిలీజ్ డేట్ ను ప్రకటించాడు జక్కన్న. మరో రెండు రోజుల్లో అంటే మే 4న బాహుబలికి సంబంధించి రెండో పోస్టర్ విడుదల చేస్తానని ప్రకటించాడు. ఆ పోస్టర్ ఏంటనే విషయాన్ని కూడా ముందే చెప్పేశాడు. సినిమాలో రాజమౌళి పోషించిన శివుడు పాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తానని ప్రకటించాడు రాజమౌళి.
రాజమౌళి స్టయిల్ మొదట్నుంచి ఇదే. తను చేసే పనేంటి.. తన సినిమా ఏంటనే విషయాన్ని ఎలాంటి సస్పెన్స్ పెంచకుండా ముందే చెప్పేస్తాడు. అలా చేసి అంచాలు పెరగకుండా జాగ్రత్తపడతాడు. మగధీర సినిమా నుంచి మొన్నటి ఈగ వరకు ప్రతి సినిమా కథను ముందే చెప్పేశాడు. ఇప్పుడు పోస్టర్లలో ఏముంటుందనే విషయాన్ని కూడా ముందుగానే రివీల్ చేస్తున్నాడు. అయితే విషయం ముందే తెలిసిపోతున్నప్పటికీ బాహుబలి సినిమాపై అంచనాలు మాత్రం తగ్గట్లేదు.
First Published:  2 May 2015 3:29 AM GMT
Next Story