పొట్టని తగ్గించే అనాస

 పండ్లన్నీ ముఖ్యమైనవే అయినా అనాసపండుకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. చక్కని రుచి, సువాసన కలిగిన ఆనాస పండులో 85శాతం నీరు ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ,బి,సి ఉన్నాయి.
 – పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారికి అనాస పండు దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది. అనాసపండు ముక్కలను నాలుగు టీస్పూన్‌ల వాము పొడిని బాగా కలియబెట్టి ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా ఉడికించాలి. రాత్రంతా అలాగే ఉంచి మర్నాడు ఉదయాన్నే వాటిని వడకట్టి ఆ కషాయాన్ని పరగడుపునే తాగాలి. ఇలా పది రోజులు తాగితే ఆ తర్వాత పొట్ట తగ్గడం మొదలవుతుంది.
 – అనాస పండుతో పచ్చ కామెర్లు నయమవుతాయి.
 – మూత్ర పిండాలలోని రాళ్లు కరుగుతాయి.
 – ఒళ్లు నొప్పులు, నడుము నొప్పి మొదలైన వాటిని తగ్గిస్తుంది.
 – కంటి చూపు మెరుగుపడుతుంది.
 – ఆకలి లేదని మారాం చేసే పిల్లలకు ఆనాస పండు రసం పట్టిస్తే ఆకలి బాగా పెరుగుతుంది.
 – శారీరక ఎదుగుదల, ఎముకల పటుత్వం మెరుగవుతాయి.
 – అనాస ఆకుల రసం కడుపులోని పురుగులను నాశనం చేస్తుంది.
 – అనాస ఆకులరసంలో ఒక చెంచా తేనె కలిపి తాగితే విరోచనం అయ్యి కడుపులోని పురుగులు బయటపడతాయి.
 – అనాస పండు ముక్కలను తేనెలో కలిపి తింటే శారీరక శక్తి పెరుగుతుంది. శరీరం నిగారింపును సంతరించుకుంటుంది.
 – తరచూ అనాస పండును తింటే మూత్ర పిండాలలోని రాళ్లు కరిగిపోతాయి. 
 – కడుపు నిండుగా ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఒక చిన్న అనాస ముక్కను తింటే చాలు తేలిగ్గా జీర్ణమైపోతుంది.