Telugu Global
Cinema & Entertainment

రానా టైపు షాకిచ్చిన స్వాతి

బయటే కాదు.. టాలీవుడ్ లో కూడా ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అల్లరినరేష్ ఎంచక్కా ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. మంచు మనోజ్ నిశ్చితార్థం కూడా పూర్తయింది. ఈ ఇద్దరు హీరోలు ఈ నెలలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. లిస్ట్ లో మరింత మంది టాలీవుడ్ స్టార్ల పేర్లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈమధ్య తను పెళ్లి చేసుకున్నానంటూ హీరో రానా ట్విట్టర్ లో ఫొటో పెట్టి అందర్నీ షాక్ కు గురిచేశాడు. పెళ్లి కొడుకు ముస్తాబులో […]

రానా టైపు షాకిచ్చిన స్వాతి
X
బయటే కాదు.. టాలీవుడ్ లో కూడా ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అల్లరినరేష్ ఎంచక్కా ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. మంచు మనోజ్ నిశ్చితార్థం కూడా పూర్తయింది. ఈ ఇద్దరు హీరోలు ఈ నెలలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. లిస్ట్ లో మరింత మంది టాలీవుడ్ స్టార్ల పేర్లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈమధ్య తను పెళ్లి చేసుకున్నానంటూ హీరో రానా ట్విట్టర్ లో ఫొటో పెట్టి అందర్నీ షాక్ కు గురిచేశాడు. పెళ్లి కొడుకు ముస్తాబులో రానా గెటప్ చూసి అంతా నిజమే అనుకున్నారు. ఇంత సీక్రెట్ గా ఈ కుర్రాడు పెళ్లి చేసుకున్నాడేంటి.. అసలు ఎవర్ని చేసుకున్నాడు లాంటి అనుమానాలు నిమిషంలోనే రెట్టింపయ్యాయి అందరికీ. అంతలోనే అదంతా తన కొత్త సినిమా షూటింగ్ లో భాగమంటూ ఏప్రిల్ చివర్లో ఏప్రిల్ ఫూల్ చేశాడు జనాల్ని. ఇప్పుడు రానా బాటలోనే స్వాతి కూడా ముస్తాబైంది. చక్కగా పెళ్లి కూతురిలా ముస్తాబై పీటలపై కూర్చుంది. కొందరు షాకయినప్పటికీ కట్ చేస్తే అదొక సినిమా కోసమని తేలింది. గీతాంజలి సినిమాని తెరకెక్కించిన రాజ్ కిరణ్ దర్శకత్వంలో
స్వాతి ఓ సినిమా చేస్తోంది. ఆ సినిమాలో కీలక సన్నివేశాల కోసమే పెళ్లి కూతురులా ముస్తాబై అందర్నీ ఆశ్చర్యపరిచింది స్వాతి.
Watch For Swathi StillsSwathi Latest Stills
First Published:  2 May 2015 2:26 AM GMT
Next Story