Telugu Global
Cinema & Entertainment

అఖిల్ ను ఆకర్షించిన లొకేషన్

వినాయక్ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు అక్కినేని సూపర్ స్టార్ అఖిల్. ఈ సిసింద్రీ కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఎండాకాలం కావడంతో అందరి హీరోల్లానే అఖిల్ కూడా విదేశాల బాట పట్టడానికి సిద్ధమౌతున్నాడు. త్వరలోనే ఈ యంగ్ స్టార్‌ స్పెయిన్ వెళ్లబోతున్నాడు. అఖిల్ కొత్త సినిమాకు సంబంధించి అక్కడ రెండు పాటలు షూట్ చేస్తారు. ఒకటి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అయితే ఇంకోటి హీరోయిన్ తో వచ్చే […]

అఖిల్ ను ఆకర్షించిన లొకేషన్
X
వినాయక్ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు అక్కినేని సూపర్ స్టార్ అఖిల్. ఈ సిసింద్రీ కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఎండాకాలం కావడంతో అందరి హీరోల్లానే అఖిల్ కూడా విదేశాల బాట పట్టడానికి సిద్ధమౌతున్నాడు. త్వరలోనే ఈ యంగ్ స్టార్‌ స్పెయిన్ వెళ్లబోతున్నాడు. అఖిల్ కొత్త సినిమాకు సంబంధించి అక్కడ రెండు పాటలు షూట్ చేస్తారు. ఒకటి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అయితే ఇంకోటి హీరోయిన్ తో వచ్చే డ్యూయట్. ఈ లొకేషన్ల వేట కోసం దర్శకుడు వీవీ వినాయక్ ఇప్పటికే స్పెయిన్ చేరుకున్నాడు. కొన్ని లొకేషన్లు కూడా ఫైనలైజ్ చేశాడని సమాచారం. అంతా సెట్ అయిన తర్వాత అఖిల్ టీం స్పెయిన్ లో ల్యాండ్ అవుతుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. హీరో నితిన్ ఈ సినిమాకు నిర్మాతల్లో ఒకడిగా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
First Published:  2 May 2015 9:00 AM GMT
Next Story