Telugu Global
Family

విధిని దేవుడు కూడా త‌ప్పించుకోలేడు (FOR CHILDREN)

         కొన్ని ప్ర‌కృతి నియ‌మాలుంటాయి. జీవితానికి సంబంధించిన ధ‌ర్మాలుంటాయి. వాటిని అతిక్ర‌మించ‌డానికి ఎవ‌రికీ వీలుప‌డ‌దు. చివ‌రికి ఆ నియ‌మాల్ని, ధ‌ర్మాన్ని సృష్టించిన దైవానికైనా వాటిని దాటడానికి వీలుప‌డ‌దు. దాన్నే క‌ర్మ అని కూడా అంటారు.        రామాయ‌ణంలో వాలి సుగ్రీవుల గురించి వినే ఉంటాం. వాలి సుగ్రీవులు సోద‌రులైనా శ‌త్రువులు. వాలి మ‌హా బ‌ల‌శాలి. పైగా అత‌నికి ఒక వ‌ర‌ముంది. ఎవ‌రు అత‌నితో యుద్ధం చేసినా ఎదుటి వ్య‌క్తిలోని స‌గం శ‌క్తి అత‌నికి వ‌చ్చేస్తుంది. […]

కొన్ని ప్ర‌కృతి నియ‌మాలుంటాయి. జీవితానికి సంబంధించిన ధ‌ర్మాలుంటాయి. వాటిని అతిక్ర‌మించ‌డానికి ఎవ‌రికీ వీలుప‌డ‌దు. చివ‌రికి ఆ నియ‌మాల్ని, ధ‌ర్మాన్ని సృష్టించిన దైవానికైనా వాటిని దాటడానికి వీలుప‌డ‌దు. దాన్నే క‌ర్మ అని కూడా అంటారు.

రామాయ‌ణంలో వాలి సుగ్రీవుల గురించి వినే ఉంటాం. వాలి సుగ్రీవులు సోద‌రులైనా శ‌త్రువులు. వాలి మ‌హా బ‌ల‌శాలి. పైగా అత‌నికి ఒక వ‌ర‌ముంది. ఎవ‌రు అత‌నితో యుద్ధం చేసినా ఎదుటి వ్య‌క్తిలోని స‌గం శ‌క్తి అత‌నికి వ‌చ్చేస్తుంది.

అందువ‌ల్ల అత‌ను ఎప్పుడూ ఎవ‌రితో ఓడిపోవ‌డం అంటూ జ‌ర‌గ‌దు. అజేయంగా నిలిచేవాడు. అందువ‌ల్ల ఎన్నిసార్లు అత‌న్తో సుగ్రీవుడు యుద్ధం చేసినా ఓడిపోయేవాడు.

సుగ్రీవుడు శ్రీరామ‌చంద్రుణ్ణి ఆశ్ర‌యించాడు. శ్రీరామ చంద్రుడు దైవాంశ సంభూతుడైనా సూటిగా స‌రాస‌రి వాలిని ఎదుర్కోలేదు. కార‌ణం రాముని స‌గం శ‌క్తి వాలికి చెందుతుంది. అందువ‌ల్ల దేవుడైనా వాలిని ముఖాముఖి ఎదుర్కోలేదు. చెట్టు

చాటు నించీ బాణం వేసి చంపాడు. చ‌నిపోతూ వాలి ‘నేను నీకు ఏ అప‌కారం చెయ్య‌లేదు. నిష్కారణంగా న‌న్ను చంపావు. దీనికి ఫ‌లితం త‌ప్ప‌క అనుభ‌వించాలి. వ‌చ్చే జ‌న్మ‌లో నువ్వు ఈ ర‌క‌మైన మ‌ర‌ణాన్నే పొందుతావు’ అని శ‌పించాడు.

త‌రువాతి జ‌న్మ‌లో రాముడు కృష్ణుడుగా అవ‌త‌రించాడు. వాలి బోయ‌వాడుగా పుట్టాడు. మ‌హాభార‌త యుద్ధానంత‌రం కృష్ణుడు ఒక అడ‌విలో చెట్టు కింద విశ్రాంతిగా ప‌డుకుని ఉన్నాడు. కాలు ఇటూ అటూ క‌దిలిస్తూ ఉన్నాడు. ఆయ‌న కాలి బొట‌న వేలు మీద సూర్య కాంతి ప‌డి అది జింక క‌న్నులా మెరిసింది. అది జింక అనుకుని బోయ‌వాడు బాణం వేశాడు. వ‌చ్చి చూస్తే కృష్ణుని కాల్లో బాణం. కృష్ణుడు మ‌ర‌ణావ‌స్థ‌లో ఉన్నాడు. బోయ‌వాడు ‘పొర‌పాటైంది. నేను కావాల‌ని బాణం వేయ‌లేదు.

జింక అని భ్ర‌మ ప‌డ్డాను. మ‌న్నించండి’ అని వేడుకున్నాడు.

అప్పుడు కృష్ణుడు గ‌త జ‌న్మ గురించి వివ‌రించాడు. తాను రాముడై ఉన్న‌ప్పుడు వాలిని చంపిన విధం, ఆ వాలే ఈ జ‌న్మ‌లో బోయ‌వాడుగా జ‌న్మించి త‌న శాపాన్ని నెర‌వేర్చుకోవ‌డం జ‌రిగింద‌ని స‌ముదాయించాడు.

విధి బ‌లీయం. ఎవ‌రూ దాట‌లేనిది. దానిని ఎవ‌రూ అధిగ‌మించ‌లేరు.

అతిక్ర‌మించ‌లేరు. ఎన్ని జ‌న్మ‌లెత్తినా ఆ నియ‌మాలు పూర్త‌య్యే దాకా, ఆ విధి విధానాలు నెర‌వేర్చే దాకా అవి వ‌దిలిపెట్ట‌వు.

మ‌నం ఏది నాటితే అదే మొల‌కెత్తుతుంది. జీవిత‌మ‌న్న‌ది మ‌న చ‌ర్య‌లు పండే పొలం లాంటిది. మ‌న‌మేది చేస్తే ఫ‌లితం దాన్ని బ‌ట్టే ఉంటుంది. ప్రాచీనులు దాన్నే క‌ర్మ ఫ‌ల‌మ‌‌న్నారు.

First Published:  2 May 2015 8:25 PM GMT
Next Story