Telugu Global
Others

నేపాల్ లో 7రోజుల తరువాత బయిటపడ్డ 105 సంవత్సరాల వృద్ధుడు

ఖాట్మండు: హిమ శిఖరాల్లో ఒదిగిపోయిన చిన్న రాజ్యం నేపాల్‌కు తీరని కష్టం వచ్చిపడింది. నేపాల్‌ను నేలమట్టం చేసిన భూప్రకంపనలు మళ్లీ మళ్లీ అక్కడి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం కూడా దేశంలోని వేరు వేరు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. దీంతో అక్కడి ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ళ‌దీస్తున్నారు. అయితే భారీ భూకంపం తర్వాత కొన్ని వారాల పాటు ప్రకంపనలు వస్తాయని, వీటికి భయపడాల్సిన పని లేదని అధికారులు చెబుతున్నారు.  […]

ఖాట్మండు: హిమ శిఖరాల్లో ఒదిగిపోయిన చిన్న రాజ్యం నేపాల్‌కు తీరని కష్టం వచ్చిపడింది. నేపాల్‌ను నేలమట్టం చేసిన భూప్రకంపనలు మళ్లీ మళ్లీ అక్కడి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం కూడా దేశంలోని వేరు వేరు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. దీంతో అక్కడి ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ళ‌దీస్తున్నారు. అయితే భారీ భూకంపం తర్వాత కొన్ని వారాల పాటు ప్రకంపనలు వస్తాయని, వీటికి భయపడాల్సిన పని లేదని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు భూకంప బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే నేపాల్‌కు సాయమందించే విషయంలో భారత్‌ స్పందించిన తీరు చైనా, పాకిస్థాన్‌కు కంటగింపుగా మారింది. మోదీ సర్కారు సహాయక చర్యల కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందంటూ చైనా, పాకిస్థాన్‌ దేశాలు నేపాల్‌ ప్రభుత్వం దృష్ట‌ికి తెచ్చాయి. హెలికాప్టర్‌లో పాత్రికేయులను తీసుకెళ్లడమే ఇందుకు నిదర్శనమని ఆరోపించాయి. దీంతో హెలికాప్టర్లలో జర్నలిస్టులను తీసుకెళ్లడంపై నేపాల్‌ ప్రభుత్వం నిషేధం విధించింది.
కాగా నేపాల్‌లో భూకంపం వ‌ల్ల దుర్మ‌ర‌ణం పాల‌యిన వారి సంఖ్య 7000కు చేరుకుంది. ఈ విష‌యాన్ని ఆ దేశ ప్ర‌ధాని సుశీల్ కోయిరాలా అధికారికంగా తెలిపారు. బాధితుల‌కు సేవ‌లందించ‌డంలో భార‌తీయ సైనిక ద‌ళాలు చేస్తున్న సేవ‌ల‌ను మ‌రువ‌లేన‌ని ఆయ‌న అన్నారు. వారం రోజుల త‌ర్వాత కూడా శిథిలాల తొల‌గింపు కొన‌సాగుతూనే ఉంది. ఏడు రోజుల త‌ర్వాత శిథిలాల నుంచి న‌లుగురు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఇందులో 105 సంవ‌త్స‌రాల వృద్ధుడు కూడా ఉండ‌డం విశేషం.
First Published:  3 May 2015 8:44 AM GMT
Next Story