Telugu Global
Others

ప్రసాదరెడ్డి హత్యకేసులో 8మంది అరెస్ట్

అనంతపురం : వైసీపీ నేత ప్రసాదరెడ్డి హత్యకేసులో మరో నలుగురు నిందితులను రాప్తాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 8మందికి చేరింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే గుర్నాధ‌రెడ్డి కూడా ఉన్నారు. ఒక నాయ‌కుడ్ని పోగొట్టుకున్న త‌మ‌కే వేధింపులు ఎదుర‌వుతున్నాయ‌ని, త‌మ పార్టీకి చెందిన వారినే పోలీసులు ల‌క్ష్యంగా పెట్టుకుని అరెస్ట్‌లు చేస్తున్నార‌ని వైఎస్ఆర్‌సీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.  వైసీపీ నేతల హత్యలు, అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా  సోమవారం అనంతపురం […]

అనంతపురం : వైసీపీ నేత ప్రసాదరెడ్డి హత్యకేసులో మరో నలుగురు నిందితులను రాప్తాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 8మందికి చేరింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే గుర్నాధ‌రెడ్డి కూడా ఉన్నారు. ఒక నాయ‌కుడ్ని పోగొట్టుకున్న త‌మ‌కే వేధింపులు ఎదుర‌వుతున్నాయ‌ని, త‌మ పార్టీకి చెందిన వారినే పోలీసులు ల‌క్ష్యంగా పెట్టుకుని అరెస్ట్‌లు చేస్తున్నార‌ని వైఎస్ఆర్‌సీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతల హత్యలు, అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా సోమవారం అనంతపురం బంద్‌కు పిలుపునిచ్చినట్టు ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్‌సీపీ నాయ‌కులు హ‌త్య‌లు జ‌రుగుతున్న తీరును, తెలుగుదేశం పార్టీ హంత‌క చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నా ప్ర‌భుత్వం నిమ్మ‌కునీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించడాన్ని నిర‌సిస్తూ త‌మ పార్టీ అధినేత వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న‌రెడ్డి నేతృత్వంలో రేపు గవర్నర్‌ను క‌ల‌వ‌నున్న‌ట్టు విశ్వేశ్వ‌ర‌రెడ్డి పేర్కొన్నారు.
First Published:  2 May 2015 3:10 PM GMT
Next Story