Telugu Global
Others

కేంద్రం డబ్బుఇచ్చినా... వాడుకోని వైద్యశాఖ

విజయవాడ నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలనేది దశాబ్దాల నాటి కల. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆస్పత్రి ఏర్పాటు విషయంలో ప్రకటనలకే పరిమితమయ్యారే తప్ప ఆచరణకు నోచుకోలేదు. కేంద్రం నిధులు విడుదల చేసినా పాలకుల తీరుతో సూపర్ స్పెషాలిటీలో జాప్యం జరుగుతోంది. అనుకోని విధంగా సిద్ధార్థ వైద్య కళాశాలకు కేంద్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ పేరుతో ప్రధాన మంత్రి స్వాస్థ్ సురక్ష యోజన ద్వారా రూ.150 కోట్లు కేటాయించింది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు పంపాలని ఎనిమిది […]

కేంద్రం డబ్బుఇచ్చినా... వాడుకోని వైద్యశాఖ
X

విజయవాడ నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలనేది దశాబ్దాల నాటి కల. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆస్పత్రి ఏర్పాటు విషయంలో ప్రకటనలకే పరిమితమయ్యారే తప్ప ఆచరణకు నోచుకోలేదు. కేంద్రం నిధులు విడుదల చేసినా పాలకుల తీరుతో సూపర్ స్పెషాలిటీలో జాప్యం జరుగుతోంది.

అనుకోని విధంగా సిద్ధార్థ వైద్య కళాశాలకు కేంద్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ పేరుతో ప్రధాన మంత్రి స్వాస్థ్ సురక్ష యోజన ద్వారా రూ.150 కోట్లు కేటాయించింది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు పంపాలని ఎనిమిది నెలల క్రితమే రాష్ట్ర వైద్య,విద్య శాఖకు ఆదేశాలందాయి. తొలి విడతగా రూ.60 కోట్లు కేటాయిస్తున్నట్లు లేఖ కూడా అందింది. కానీ నేటికీ ప్రతిపాదనలు సిద్ధం చేయడంలో అధికారులు, పాలకులు ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మొదటి విడతగా విడుదల చేసిన రూ.60 కోట్లు సకాలంలో వాడితే రెండో విడత విడుదలయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాని దీనికి సంబంధించిన ఫైల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వద్ద ఎన్నోరోజుల నుంచి పెండింగ్‌లో ఉంది. ఈ విషయంలో వైద్యశాఖ మంత్రి, ఎంపీలు చొరవ చూపాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.

First Published:  3 May 2015 8:58 AM GMT
Next Story