Telugu Global
National

బ్యాంకు ఖాతా ఉంటే.. 2 ల‌క్ష‌ల బీమా ఉన్నట్టే! 

హైదరాబాద్ : బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఉన్న ప్రతి వారికీ బీమా సౌకర్యాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది గ‌త‌ శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది. బ్యాంకుల్లో ఖాతా ఉన్న సభ్యులు, ఇకపై ఏదైనా ప్రమాదంలో మరణిస్తే, వారి కుటుంబాలకు రూ 2 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా దీన్ని రూపొందించారు. బ్యాంకుల్లో పొదుపు ఖాతా కలిగిన 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న‌వారు ‘ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన’ పథకం కింద రోజుకు […]

హైదరాబాద్ : బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఉన్న ప్రతి వారికీ బీమా సౌకర్యాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది గ‌త‌ శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది. బ్యాంకుల్లో ఖాతా ఉన్న సభ్యులు, ఇకపై ఏదైనా ప్రమాదంలో మరణిస్తే, వారి కుటుంబాలకు రూ 2 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా దీన్ని రూపొందించారు. బ్యాంకుల్లో పొదుపు ఖాతా కలిగిన 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న‌వారు ‘ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన’ పథకం కింద రోజుకు ఒక రూపాయి లేదా ఏడాదికి రూ 330 ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటే మరో బీమా పథకాన్నీ బ్యాంకు ఖాతాలతో అనుసంధానిస్తున్నారు. పొదుపు ఖాతా ఉన్న 18 నుంచి 70 ఏళ్ల వయస్సు గలిగిన వారి కోసం, ‘ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన’ పథకాన్ని అమలు చేయనున్నారు. దీని కింద సభ్యుడు మరణించినా, ఏదైనా ప్రమాదంలో అంగవైకల్యం సంభవించినా, రూ 2 లక్షల పరిహారాన్ని అందివ్వనున్నారు. ఒక వేళ పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే లక్ష రూపాయల పరిహారాన్ని చెల్లిస్తారు. ఈ సురక్ష బీమా యోజన కోసం, ఖాతాదారులు, ఏడాదికి ఓసారి, ప్రీమియం కింద రూ 12లను చెల్లిస్తే స‌రిపోతుంది. వీటితో పాటే, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం రూపొందించిన ‘అటల్‌ పెన్షన్‌ యోజన’నూ బ్యాంకులు అమలు చేయనున్నాయి. బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఉన్న 18 నుంచి 44 ఏళ్ల వయస్కులను ఈ పథకంలో సభ్యులుగా చేర్చుకుంటారు. వృద్దాప్యంలో ఆర్థిక భద్రత కోసం బ్యాంకు ఖాతాల్లో పొదుపు చేసుకునే అవకాశం వీరికి కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రకాల బ్యాంకులు, బీమా సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో ఈ పథకాలను అమలు చేయనున్నాయి. శుక్రవారం నుంచి ఈ పథకాలకు సంబంధించి సభ్యత్వ నమోదును ప్రారంభించారు.
First Published:  2 May 2015 9:13 PM GMT
Next Story