భర్తపై కోపంతో కొడుకును క‌డ‌తేర్చిన క‌సాయి

మెదక్ : భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ చివరికి మ‌తి స్థిమితం లేని ఓ కన్నకొడుకు ప్రాణాలు తీసింది. మెద‌క్ జిల్లా పెద్దశంకరంపేట మండలం జూకల్‌ గ్రామానికి చెందిన గుర్ర సత్తెమ్మ, సంగయ్య భార్యాభర్తలు. ఇటీవల సంగయ్య ఆరు గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమికి డబ్బులు చెల్లించాల్సి ఉందని, నగలుగానీ, డబ్బులుగానీ ఇవ్వాలని భార్యను అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో ఆగ్రహం పట్టలేని సత్తెమ్మ కిరోసిన్‌ తీసుకుని మతి స్థిమితం లేని కొడుకు యేసు(21)పై పోసి నిప్పంటించింది. పక్కనే ఉన్న పన్నెండేళ్ల కుమార్తె గంగమ్మ వారించినా ఆమె వినలేదు. మంటల్లో కాలిపోతున్న యేసును గమనించిన స్థానికులు 108లో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యేసు మరణించాడు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.