Telugu Global
Others

మతిమరుపును పోగొట్టే బొప్పాయి

బొప్పాయి ఏమిటి…. మతిమరుపుకు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా…? బొప్పాయితో మతిమరుపుకు చెక్ చెప్పవచ్చని పరిశోధకులంటున్నారు. ప్రతిరోజూ బొప్పాయి పండును తింటే మతిమరుపు సమస్య తీరిపోతుందట. ఇదే కాదు బొప్పాయితో ఇంకా అనేక రకాల ప్రయోజనాలున్నాయి.  – బొప్పాయి పాలల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. బొప్పాయి పాలకు పేరిన నెయ్యి కలిపి తీసుకుంటే కడుపులో నొప్పి తగ్గుతుందట.  – కాలేయం పెరుగుదలను అరికట్టే గుణం బొప్పాయి పాలకు ఉందట. బొప్పాయి పాలకు సమానంగా పంచదారను కలిపి మూడు భాగాలుగా […]

మతిమరుపును పోగొట్టే బొప్పాయి
X
బొప్పాయి ఏమిటి…. మతిమరుపుకు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా…? బొప్పాయితో మతిమరుపుకు చెక్ చెప్పవచ్చని పరిశోధకులంటున్నారు. ప్రతిరోజూ బొప్పాయి పండును తింటే మతిమరుపు సమస్య తీరిపోతుందట. ఇదే కాదు బొప్పాయితో ఇంకా అనేక రకాల ప్రయోజనాలున్నాయి.
– బొప్పాయి పాలల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. బొప్పాయి పాలకు పేరిన నెయ్యి కలిపి తీసుకుంటే కడుపులో నొప్పి తగ్గుతుందట.
– కాలేయం పెరుగుదలను అరికట్టే గుణం బొప్పాయి పాలకు ఉందట. బొప్పాయి పాలకు సమానంగా పంచదారను కలిపి మూడు భాగాలుగా చేసి రోజుకో భాగం చొప్పున సేవిస్తే కాలేయ పెరుగుదల నివారణ అవుతుంది.
– బొప్పాయి పాలను తేలు కుట్టిన చోట రాస్తే విషం తొలగిపోతుంది.
– బొప్పాయి గింజలతోనూ ప్రయోజనముంది. గింజల్ని ఎండబెట్టి పొడి చేసి పేరిన నెయ్యితో కలిపి తీసుకుంటే కడుపులోని నులి పురుగులు పోతాయి.
– బొప్పాయి ఆకులను వేడి నీటితో నూరి నరాలపై రాస్తే వాపు తగ్గిపోతుంది.
First Published:  2 May 2015 10:22 PM GMT
Next Story