Telugu Global
Others

ప్రభుత్వంపై పరిటాల సునీత అలక?

            మంత్రి పరిటాల సునీతకు కోపం వచ్చింది. తనకు కేటాయించిన భద్రతా సిబ్బందిని శుక్రవారంనాడు వెనక్కు తిప్పి పంపింది.             ప్రసాదరెడ్డి హత్యకేసులో రాప్తాడు ఎస్‌.ఐ.నాగేంద్ర ప్రసాద్‌ను, ఇటుకలపల్లి సి.ఐ. శ్రీనివాసులుని వీ ఆర్‌కి పంపుతూ డిఐజీ, ఎస్‌.పి.లు ఉత్తర్వులు జారీచేయడం ఆమె ఆగ్రహానికి కారణమని కొందరు అనుకుంటున్నారు. కాని అసలుకారణం ఇది కాదని తనపట్ల, తన కొడుకు పట్ల అనంతపురం జిల్లాలోని తెలుగు దేశం ఎంఎల్‌ఏలు వ్యతిరేకంగా ఉండడం, ముఖ్యంగా పరిటాల శ్రీరామ్‌ని కట్టడి చేయడానికి […]

ప్రభుత్వంపై పరిటాల సునీత అలక?
X

మంత్రి పరిటాల సునీతకు కోపం వచ్చింది. తనకు కేటాయించిన భద్రతా సిబ్బందిని శుక్రవారంనాడు వెనక్కు తిప్పి పంపింది.

ప్రసాదరెడ్డి హత్యకేసులో రాప్తాడు ఎస్‌.ఐ.నాగేంద్ర ప్రసాద్‌ను, ఇటుకలపల్లి సి.ఐ. శ్రీనివాసులుని వీ ఆర్‌కి పంపుతూ డిఐజీ, ఎస్‌.పి.లు ఉత్తర్వులు జారీచేయడం ఆమె ఆగ్రహానికి కారణమని కొందరు అనుకుంటున్నారు. కాని అసలుకారణం ఇది కాదని తనపట్ల, తన కొడుకు పట్ల అనంతపురం జిల్లాలోని తెలుగు దేశం ఎంఎల్‌ఏలు వ్యతిరేకంగా ఉండడం, ముఖ్యంగా పరిటాల శ్రీరామ్‌ని కట్టడి చేయడానికి వాళ్ళు చేయాల్సినవన్నీ పరోక్షంగా చేస్తుండడం, ఈ విషయంలో అధినాయకత్వం నుంచి ఆమెకు మద్దతు లేకపోవడం ఆమె కోపానికి కారణం అంటున్నారు. అదను చూసుకుని ఆమె ఇప్పుడు ఈ విధంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసిందంటున్నారు.

First Published:  2 May 2015 7:42 PM GMT
Next Story