Telugu Global
Others

పాక్ జెండాల‌ను ఇండియాలో ప్ర‌ద‌ర్శించ‌వ‌చ్చా?

జ‌మ్మూ-క‌శ్మీర్ సీఎంగా ముఫ్తీ మ‌హ‌మ్మ‌ద్ ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి భార‌త్‌ వ్య‌తిరేక వ్యాఖ్య‌ల స్వ‌రం పెరుగుతోంది. తాజాగా రియ‌త్‌ కాన్ఫ‌రెన్స్ పాకిస్తాన్‌ జెండాలు భార‌త్‌లో ప్ర‌ద‌ర్శించ‌డం నేరం కాద‌ని స‌మ‌ర్థించుకుంది. దాన్ని దేశంపై యుద్ధంగా ప‌రిగ‌ణించ‌లేమ‌ని 1983లోనే క‌శ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించింది. ఇటీవ‌ల హురియ‌త్ ఏర్పాటు చేసిన స‌భ‌లో పాక్ జెండాలు ప్ర‌ద‌ర్శించిన వారిపై కేసులు న‌మోదు చేయ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ హురియ‌త్ ఈ వ్యాఖ్య‌లు చేసింది. అస‌లు ఈ త‌ర‌హా ధోర‌ణి పీడీపీ-బీజేపీ కొత్త […]

జ‌మ్మూ-క‌శ్మీర్ సీఎంగా ముఫ్తీ మ‌హ‌మ్మ‌ద్ ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి భార‌త్‌ వ్య‌తిరేక వ్యాఖ్య‌ల స్వ‌రం పెరుగుతోంది. తాజాగా రియ‌త్‌ కాన్ఫ‌రెన్స్ పాకిస్తాన్‌ జెండాలు భార‌త్‌లో ప్ర‌ద‌ర్శించ‌డం నేరం కాద‌ని స‌మ‌ర్థించుకుంది. దాన్ని దేశంపై యుద్ధంగా ప‌రిగ‌ణించ‌లేమ‌ని 1983లోనే క‌శ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించింది. ఇటీవ‌ల హురియ‌త్ ఏర్పాటు చేసిన స‌భ‌లో పాక్ జెండాలు ప్ర‌ద‌ర్శించిన వారిపై కేసులు న‌మోదు చేయ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ హురియ‌త్ ఈ వ్యాఖ్య‌లు చేసింది.
అస‌లు ఈ త‌ర‌హా ధోర‌ణి పీడీపీ-బీజేపీ కొత్త స‌ర్కారు కొలువుదీరిన తొలిరోజు నుంచే మొద‌లైంది. ప్ర‌మాణ స్వీకారం చేసిన వేదిక మీద నుంచే సాక్షాత్తూ సీఎం ముఫ్తీ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా సాగ‌డానికి స‌హ‌క‌రించిన తీవ్ర‌వాదుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నా.. అంటూ వ్యాఖ్యానించి తీవ్ర దుమారం రేపారు. భార‌త సార్వ‌భౌమాధికారాన్ని వేర్పాటువాదుల‌కు, పాకిస్తాన్‌కు తాక‌ట్టుపెట్టేలా ఆయ‌న మాట్లాడార‌ని దేశ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. కొన్నిరోజుల తేడాతోనే వేర్పాటు వాది మస్రమ్‌ ఆలం’తో సహా పలువురిని విడుదల చేసి ముఫ్తీ స‌ర్కారు మ‌రో వివాదానికి కార‌ణ‌మైంది. త‌రువాత‌ కొద్దిరోజుల‌కే భార‌త పార్ల‌మెంటుపై దాడి కేసులో ప్ర‌ధాన నిందితుడు అఫ్జ‌ల్ గురు అవ‌శేషాల‌ను అప్ప‌గించాల‌ని పీడీపీ మ‌రోసారి తీవ్ర‌వాదుల‌కు అనుకూల వ్యాఖ్య‌లు చేసింది. మొత్తానికి క‌శ్మీర్‌లో పీడీపీ-బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ స‌ర్కారు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి త‌ల‌నొప్పిగా మారింది. దేశ‌భ‌క్తుల పుట్టినిల్లుగా చెప్పుకునే బీజేపీ ప‌రిస్థితి అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా త‌యారైంది. పార్ల‌మెంటులో ప్ర‌తిప‌క్షాల‌ను స‌మాధాన ప‌ర‌చ‌లేక బీజేపికి త‌ల‌ప్రాణం తోక‌కు వ‌స్తోంది.
First Published:  3 May 2015 3:15 PM GMT
Next Story