Telugu Global
Cinema & Entertainment

 వీడు మరో శింబులా తయారయ్యాడు..

తమిళనాట పుకార్లకు, ఎఫైర్లకు పెట్టింది పేరు శింబు. అప్పట్లో నయనతారతో, కొన్నాళ్ల తర్వాత హన్సికతో శింబు సాగించిన ప్రేమాయణం టాక్ ఆఫ్ ది కోలీవుడ్ గా మారింది. అయితే ఈ మధ్య కాలంలో శింబు ఈ విషయంలో కాస్త తగ్గాడనిపిస్తోంది. శింబు సంగతి తెలిసిన చాలామంది భామలు అతడికి దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం. అయితే ఇప్పుడీ లోటును మరో హీరో భర్తీ చేస్తున్నాడు. అతడే గౌతమ్ కార్తీక్. ఈ పేరు చెబితే చాలామంది వెంటనే గుర్తుపట్టకపోవచ్చు కానీ […]

 వీడు మరో శింబులా తయారయ్యాడు..
X
తమిళనాట పుకార్లకు, ఎఫైర్లకు పెట్టింది పేరు శింబు. అప్పట్లో నయనతారతో, కొన్నాళ్ల తర్వాత హన్సికతో శింబు సాగించిన ప్రేమాయణం టాక్ ఆఫ్ ది కోలీవుడ్ గా మారింది. అయితే ఈ మధ్య కాలంలో శింబు ఈ విషయంలో కాస్త తగ్గాడనిపిస్తోంది. శింబు సంగతి తెలిసిన చాలామంది భామలు అతడికి దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం. అయితే ఇప్పుడీ లోటును మరో హీరో భర్తీ చేస్తున్నాడు. అతడే గౌతమ్ కార్తీక్. ఈ పేరు చెబితే చాలామంది వెంటనే గుర్తుపట్టకపోవచ్చు కానీ కడలి సినిమాలో హీరో అంటే వెంటనే గుర్తుపడతారు. అవును.. ఆ కార్తీకే ఇప్పుడు కోలీవుడ్ నయా లవర్ బాయ్ గా మారుతున్నాడు.
కడలి సినిమా షూటింగ్ టైమ్ లోనే హీరోయిన్ తులసీతో లవ్ లో ఉన్నాడంటూ ప్రచారం జరిగింది. తర్వాత లక్ష్మీమీనన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడంటూ మరో ప్రచారం ఊపందుకుంది. తాజాగా హీరోయిన్ ప్రియా ఆనంద్ తో గౌతమ్ కార్తీక్ డేటింగ్ చేస్తున్నాడంటూ కోలీవుడ్ మీడియో కోడై కూస్తోంది. గౌతమ్ కార్తీక్ మాత్రం ఇలాంటి పుకార్లు కామన్ అంటూ పైకి ఖండిస్తూనే.. లోలోపల పొంగిపోతున్నాడు.
First Published:  4 May 2015 12:30 AM GMT
Next Story