Telugu Global
Others

విజన్ 2020- బాబు రూపొందించలేదా?

విజన్ 2020…రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి ఈ పదం తెలియకుండా ఉండదు. ఈ మాటను తరచుగా ఉపయోగించే తెలుగుదేశం అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు కు తెలియకుండా ఉండదు. భవిష్యత్తు అవసరాలు, సమస్యలు ముందే గుర్తించి తాను విజన్ 2020 పేరుతో ఈ ప్రణాళికను రూపొందించానని అవకాశం దొరికిన ప్రతిసారి చంద్రబాబు చెప్పుకొంటారు. అయితే ఈ విజన్ 2020కి అసలు కర్త చంద్రబాబు కాదు తానేనని చెప్పారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్. నాగార్జునసాగర్ […]

విజన్ 2020- బాబు రూపొందించలేదా?
X

విజన్ 2020…రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి ఈ పదం తెలియకుండా ఉండదు. ఈ మాటను తరచుగా ఉపయోగించే తెలుగుదేశం అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు కు తెలియకుండా ఉండదు. భవిష్యత్తు అవసరాలు, సమస్యలు ముందే గుర్తించి తాను విజన్ 2020 పేరుతో ఈ ప్రణాళికను రూపొందించానని అవకాశం దొరికిన ప్రతిసారి చంద్రబాబు చెప్పుకొంటారు. అయితే ఈ విజన్ 2020కి అసలు కర్త చంద్రబాబు కాదు తానేనని చెప్పారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.

నాగార్జునసాగర్ లో జరుగుతున్న టీఆర్ఎస్ శిక్షణా శిబిరంలో కేసీఆర్ మాట్లాడుతూ బాబుకు పంచ్ ఇచ్చారు. విజన్ 2020 డ్రాఫ్ట్ తాను తయారుచేసి అప్పటి ప్లానింగ్ కమిషన్ సభ్యుడు సీహెచ్ హనుమంతరావుకు చూపించి అనేక మార్పులు చేర్పులు చేయించానని చెప్పారు. ఆ విజన్ రూపకల్పన సమయంలో బాధ్యతలు ఎత్తుకున్న ఐఏఎస్ లు, ఆఖరికి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అంతా..ఈ పెద్ద బాధ్యతను మోయలేమని పారిపోయారని తెలిపారు. అప్పుడు మంత్రిగా ఉన్న ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇదేం తలనొప్పని అన్నట్లు వివరించారు. అయినప్పటికీ వారంతా వెళ్లిపోయినా తాను పట్టుబట్టి పూర్తిచేసినట్లు చెప్పారు. అలా పూర్తయిన డ్రాఫ్ట్ ను తాను హనుమంతరావు దగ్గరికి వెళ్లి చూపిస్తే ‘ఇంత తక్కువ వయసులో ఎంతో అనుభవంతో విజన్ 2020 అనే 20 ఏళ్ల భవిష్యత్తును ఊహించి రాసిన నువ్వు గొప్పోడివి చంద్రశేఖర్’ అని ఆయన కీర్తించారని కేసీఆర్ వివరించారు. తాను, టీడీపీ లేకపోతే కేసీఆర్ సిద్దిపేటలో గొర్రెలను కాసుకునేవారని చంద్రబాబు వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఈ మేరకు చంద్రబాబుకు కేసీఆర్ తన ఝలఖ్ ఇచ్చారు. ఇక దీనిపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో మరి.

First Published:  4 May 2015 1:51 AM GMT
Next Story