Telugu Global
Cinema & Entertainment

ఈ వీకెండ్ కిక్కే కిక్కు

ఈ వీకెండ్ తెలుగు ప్రేక్షకులకు సరికొత్త కిక్ అందించడానికి సిద్ధమౌతున్నాడు మాస్ రాజా రవితేజ. తన అప్ కమింగ్ మూవీ కిక్-2 సినిమా ఆడియో లాంచ్ ను వీకెండ్ ప్లాన్ చేశాడు. మే 9న కిక్ -2 సినిమా పాటల్ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. కుదిరితే సినిమాని ఈ నెలాఖరుకే విడుదల చేయాలనుకుంటున్నారు. 9 నుంచి ప్రమోషన్ ను ఎగ్రెసివ్ గా ప్రారంభించాలని భావిస్తోంది యూనిట్. ఆడియో ఫంక్షన్ నుంచే హైప్ పెంచాలని భావిస్తోంది. దీనికి […]

ఈ వీకెండ్ కిక్కే కిక్కు
X
ఈ వీకెండ్ తెలుగు ప్రేక్షకులకు సరికొత్త కిక్ అందించడానికి సిద్ధమౌతున్నాడు మాస్ రాజా రవితేజ. తన అప్ కమింగ్ మూవీ కిక్-2 సినిమా ఆడియో లాంచ్ ను వీకెండ్ ప్లాన్ చేశాడు. మే 9న కిక్ -2 సినిమా పాటల్ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. కుదిరితే సినిమాని ఈ నెలాఖరుకే విడుదల చేయాలనుకుంటున్నారు. 9 నుంచి ప్రమోషన్ ను ఎగ్రెసివ్ గా ప్రారంభించాలని భావిస్తోంది యూనిట్. ఆడియో ఫంక్షన్ నుంచే హైప్ పెంచాలని భావిస్తోంది. దీనికి నందమూరి సపోర్ట్ ను వాడుకోవాలని భావిస్తున్నాడు రవితేజ.
కిక్-2 సినిమాకు నిర్మాత కల్యాణ్ రామ్. కాబట్టి ఆడియో ఫంక్షన్ కు ఎన్టీఆర్ ను ప్రత్యేక అతిథిగా తీసుకొస్తే బాగుంటుందని ప్లాన్ చేస్తున్నారు. అటు రవితేజకు కూడా ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్ కాబట్టి.. కిక్-2 ఆడియో ఫంక్షన్ కు ఎన్టీఆర్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు సినీవిశ్లేషకులు. కిక్-2 సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈనెల రెండోవారానికి ఫస్ట్ ప్రింట్ రెడీ అవుతుంది.
First Published:  4 May 2015 12:38 AM GMT
Next Story