Telugu Global
Cinema & Entertainment

గ‌బ్బ‌ర్ సింగ్ 2 డేట్ ఫిక్స్ చేశాడు... !

మెగా ఫ్యాన్స్ కు   ఒక వైపు చిరు 150 చిత్రం విష‌యం..మ‌రో వైపు  ప‌వ‌ర్ స్టార్ గ‌బ్బ‌ర్ సింగ్ సీక్వెల్  ఈ రెండు అస‌లు వుంటాయా లేదా అనే విష‌యంలో  ఎన్నో సందేహాలు వెంటాడుతున్నాయి ఇప్ప‌టి వ‌ర‌కు.  ఎట్ట‌కేల‌కు చిరంజీవి 150 చిత్రం  పూరీ జ‌గ‌న్నాధ్ డైరెక్ష‌న్ లో ఉంటుంద‌నే ఒక న‌మ్మ‌కం ఏర్ప‌డింది.  క‌ట్ చేస్తే ఇక ప‌వ‌ర్ స్టార్  గ‌బ్బ‌ర్ సింగ్ సీక్వెల్  చేస్తాడా  లేదా అనేది  క్లారీటి రాక స‌త‌మతం అవుతున్నారు. […]

గ‌బ్బ‌ర్ సింగ్ 2 డేట్ ఫిక్స్ చేశాడు... !
X
మెగా ఫ్యాన్స్ కు ఒక వైపు చిరు 150 చిత్రం విష‌యం..మ‌రో వైపు ప‌వ‌ర్ స్టార్ గ‌బ్బ‌ర్ సింగ్ సీక్వెల్ ఈ రెండు అస‌లు వుంటాయా లేదా అనే విష‌యంలో ఎన్నో సందేహాలు వెంటాడుతున్నాయి ఇప్ప‌టి వ‌ర‌కు. ఎట్ట‌కేల‌కు చిరంజీవి 150 చిత్రం పూరీ జ‌గ‌న్నాధ్ డైరెక్ష‌న్ లో ఉంటుంద‌నే ఒక న‌మ్మ‌కం ఏర్ప‌డింది. క‌ట్ చేస్తే ఇక ప‌వ‌ర్ స్టార్ గ‌బ్బ‌ర్ సింగ్ సీక్వెల్ చేస్తాడా లేదా అనేది క్లారీటి రాక స‌త‌మతం అవుతున్నారు. ఎందుకంటే..ఈ చిత్రం మొద‌టి భాగం వ‌చ్చి అప్పుడే మూడు సంవ‌త్స‌రాలు పూర్తి కావ‌స్తుంది. అప్ప‌టి నుంచి సీక్వెల్ వుంటుంద‌నే టాక్ అయితే న‌డుస్తుంది కానీ.. దానికి సంబంధించి ఒక సాలిడ్ స‌మాచారాం అభిమానుల‌కు పాస్ కాలేదు.
గ‌త యేడాది అంతా ఎల‌క్ష‌న్స్ లో గ‌డిపి బిజీ అయిన ప‌వ‌న్ఓ క‌ళ్యాణ్‌.. ఎట్ట‌కేల‌కు గ‌బ్బ‌ర్ సింగ్ సీక్వెల్ ను వ‌చ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్న‌ట్లు స‌మ‌చారం. ఈ చిత్రంలో హీరోయిన్ గా అనిషా అంబ్రోస్ అనే హీరోయిన్ ను ఎంచుకున్నారు. అనీషా గ‌తంలో జానికి వెడ్స్ శ్రీ‌రామ్ అనే సినిమాలో న‌టించింది. ప‌వ‌ర్ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటుకున్న బాబీ గ‌బ్బ‌ర్ సింగ్ సీక్వెల్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం హ‌రీష్ శంక‌ర్ చేసిన గ‌బ్బ‌ర్ సింగ్ కు సంబంధం లేకుండా చేస్తున్నార‌ట‌. జ‌స్ట్ టైటిల్ ను మాత్ర‌మే వాడుకుంటు ..క‌థ అంతా కొత్త‌గా రాసుకున్నార‌ని సమాచారం. మొత్తం మీద‌ వ‌చ్చే సంక్రాంతి ప‌వ‌ర్ స్టార్ అభిమానులకు పెద్ద పండ‌గే అని చెప్పాలి మ‌రి.
First Published:  4 May 2015 3:15 AM GMT
Next Story