Telugu Global
Others

బుద్ధ‌వ‌నం అభివృద్ధికి ప్ర‌త్యేక అథారిటీ: కేసీఆర్‌

విజ‌య‌పురి: నాగార్జున‌సాగ‌ర్ బుద్ధ‌వ‌నం అభివృద్ధికి ఓ ప్ర‌త్యేక అథారిటీ వేయ‌నున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి కార్య‌క‌ర్త‌ల శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో భాగంగా ఇక్క‌డ‌కు వ‌చ్చిన ఆయ‌న నాగార్జున‌సాగ‌ర్ తీర ప్రాంతంలో ఉన్న విశేషాల‌ను తిల‌కించ‌డానికి కొంత స‌మ‌యం కేటాయించారు. బుద్ధ‌వ‌నం ప్రాజెక్టు వ‌ద్ద ఆయ‌న అధికారుల స‌హ‌కారంతో ఓ మొక్క‌ను నాటి ప‌చ్చ‌ద‌నం ఆవ‌శ్య‌క‌త‌ను తెలిపారు. ఆ త‌ర్వాత ఆయ‌న అధికారుల‌తో మాట్టాడుతూ… సాగ‌ర్‌ను ప్ర‌పంచ స్థాయి బౌద్ధ క్షేత్రంగా రూపొందించాల‌ని […]

విజ‌య‌పురి: నాగార్జున‌సాగ‌ర్ బుద్ధ‌వ‌నం అభివృద్ధికి ఓ ప్ర‌త్యేక అథారిటీ వేయ‌నున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి కార్య‌క‌ర్త‌ల శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో భాగంగా ఇక్క‌డ‌కు వ‌చ్చిన ఆయ‌న నాగార్జున‌సాగ‌ర్ తీర ప్రాంతంలో ఉన్న విశేషాల‌ను తిల‌కించ‌డానికి కొంత స‌మ‌యం కేటాయించారు. బుద్ధ‌వ‌నం ప్రాజెక్టు వ‌ద్ద ఆయ‌న అధికారుల స‌హ‌కారంతో ఓ మొక్క‌ను నాటి ప‌చ్చ‌ద‌నం ఆవ‌శ్య‌క‌త‌ను తెలిపారు. ఆ త‌ర్వాత ఆయ‌న అధికారుల‌తో మాట్టాడుతూ… సాగ‌ర్‌ను ప్ర‌పంచ స్థాయి బౌద్ధ క్షేత్రంగా రూపొందించాల‌ని ఆదేశించారు. ప్ర‌పంచంలో ఉన్న బౌద్ధులంతా ఇక్క‌డ‌కు వ‌చ్చేలా ఈ కేంద్రాన్ని తీర్చి దిద్దాల‌ని ఆయ‌న కోరారు. శ్రీ‌లంక బ‌హూక‌రించిన 27 అడుగుల బుద్ధ విగ్ర‌హాన్ని స‌రైన స్థానంలో అమ‌ర్చాల‌ని ఆయ‌న సూచించారు. సాగ‌ర్‌ను మంచి ప‌ర్యాట‌క కేంద్రంగా తీర్చిదిద్దాల‌ని కేసీఆర్ ఆదేశించారు.
First Published:  3 May 2015 4:37 PM GMT
Next Story