అనుష్క ను కాపాడిన ప్రియాంక

బాలీవుడ్ లో అనుష్క శర్మ, ప్రియాంక చోప్రాకు అస్సలు పడదంటారు చాలా మంది. ప్రియాంకా చోప్రా చేయాల్సిన ఎన్నో పాత్రల్ని అనుష్క శర్మ ఎగరేసుకుపోయిందని చెప్పుకుంటారు. దీంతో ఇద్దరి మధ్య క్యాట్ ఫైట్ జోరుగా సాగుతుందని కూడా ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ప్రియాంక, అనుష్క ఇద్దరూ హీరోయిన్లే. అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం బయటపడింది. ఎయిర్ పోర్ట్ లో అనుకోని పరిస్థితుల్లో అనుష్క శర్మ అభిమానుల మధ్య ఇరుక్కింది. ప్రారంభంలో ఆటోగ్రాఫులు ఇస్తుందేమో అని ప్రియాంక అనుకుంది. కానీ వ్యవహారం శృతిమించడంతో ప్రియాంక ఎంటరై అనుష్క శర్మను రక్షించింది. అనుకోని ఘటన నుంచి తనను రక్షించిన ప్రియాంకచోప్రాకు అనుష్క కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆ సంఘటన ఇద్దరి మధ్య వైరాన్ని పూర్తిగా చెరిపేసింది. ప్రస్తుతం ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారని అంటోంది బాలీవుడ్.