Telugu Global
Cinema & Entertainment

అఖిల్ సినిమాలో ఇలియానా

ప్రస్తుతం వీవీ వినాయక్ దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోనే హీరోగా పరిచయం అవుతున్నాడు సిసింద్రీ. అందుకే ఈ మూవీకి వీలైనన్ని ఎక్కువ స్పెషల్ ఎట్రాక్షన్స్ జోడించాలనుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం అఖిల్ సినిమాలో గోవాబ్యూటీ ఇలియానా కూడా చేరిందనే టాక్ వినిపిస్తోంది. ఓ స్పెషల్ ఐటెంసాంగ్ లో ఇలియానాను తీసుకోవాలని భావిస్తున్నారు. నిజానికి ఈ స్పెషల్ సాంగ్ కోసం మొదట రాశీఖన్నాను తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే ఈమధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాఖీ […]

అఖిల్ సినిమాలో ఇలియానా
X
ప్రస్తుతం వీవీ వినాయక్ దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోనే హీరోగా పరిచయం అవుతున్నాడు సిసింద్రీ. అందుకే ఈ మూవీకి వీలైనన్ని ఎక్కువ స్పెషల్ ఎట్రాక్షన్స్ జోడించాలనుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం అఖిల్ సినిమాలో గోవాబ్యూటీ ఇలియానా కూడా చేరిందనే టాక్ వినిపిస్తోంది. ఓ స్పెషల్ ఐటెంసాంగ్ లో ఇలియానాను తీసుకోవాలని భావిస్తున్నారు. నిజానికి ఈ స్పెషల్ సాంగ్ కోసం మొదట రాశీఖన్నాను తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే ఈమధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాఖీ ఖన్నా ఆ వార్తల్ని ఖండించింది. ప్రస్తుతానికి తనకు స్పెషల్ సాంగ్స్ చేసే ఆలోచన లేదని తెగేసి చెప్పేసింది. దీంతో మేకర్స్ ఇలియానా కోసం ప్రయత్నిస్తున్నారు. జులాయి తర్వాత తెలుగు సినిమాలకు దూరమైన ఇలియానా, అఖిల్ సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇస్తే గ్రాండ్ గా ఉంటుందని భావిస్తోంది. ప్రస్తుతం నిర్మాతలు ఇలియానాతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అన్నీ కలిసొస్తే.. ప్రస్తుతం స్పెయిన్‌ లో జరుగుతున్న ఫారిన్ షెడ్యూల్ లోనే ఇలియానాతో అ స్పెషల్ సాంగ్ ను కూడా షూట్ చేయాలని భావిస్తోంది వినాయక్ టీం.
First Published:  5 May 2015 1:30 AM GMT
Next Story