Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 73

అతను: వెయిటర్‌! టీలో చచ్చిపోయిన ఈగ ఉందయ్యా! వెయిటర్‌: నాకు తెలుసు సార్‌! టీ వేడికి అది చచ్చిపోయింది! ——————————— “లేదు టీచర్‌. నేను స్టూడెంట్‌నే” అన్నాడు వినోద్‌. “ఐతే తెలివితక్కువగా ప్రవర్తించకుండా కూర్చో” అని గదురుకొంది టీచర్‌. ——————————— రచయిత : సంవత్సరం నించీ ఫుల్‌ టైం రైటర్‌గా మారిపోయానండీ. రాత్రింబవళ్ళు రచనలు చేస్తున్నాను. స్నేహితుడు:  ఎవైనా అమ్ముడుపోయాయా? రచయిత : ఆ, అమ్మాను. టీవీ, స్కూటర్‌, ఇల్లు. ——————————— “నువ్వు కుడిచేత్తో రాస్తావా? ఎడమ […]

అతను: వెయిటర్‌! టీలో చచ్చిపోయిన ఈగ ఉందయ్యా!

వెయిటర్‌: నాకు తెలుసు సార్‌! టీ వేడికి అది చచ్చిపోయింది!

———————————

“లేదు టీచర్‌. నేను స్టూడెంట్‌నే” అన్నాడు వినోద్‌.

“ఐతే తెలివితక్కువగా ప్రవర్తించకుండా కూర్చో” అని గదురుకొంది టీచర్‌.

———————————

రచయిత : సంవత్సరం నించీ ఫుల్‌ టైం రైటర్‌గా మారిపోయానండీ. రాత్రింబవళ్ళు రచనలు చేస్తున్నాను.

స్నేహితుడు: ఎవైనా అమ్ముడుపోయాయా?

రచయిత : ఆ, అమ్మాను. టీవీ, స్కూటర్‌, ఇల్లు.

———————————

“నువ్వు కుడిచేత్తో రాస్తావా? ఎడమ చేత్తో రాస్తావా?”

“రెండిటితోనూ రాయను. బాల్‌పెన్‌తో రాస్తాను.”

———————————

మోటర్‌సైకిల్‌ పైన చాలా వేగంగా వెళుతున్న అతన్ని వెంబడించి పోలీసు అడిగాడు.

“నువ్వెందుకంత స్పీడుగా వెళుతున్నావు?”

“నా బండికి బ్రేకులు ఫెయిలయ్యాయి. యాక్సిడెంట్‌ కాకముందే ఇంటికి చేరుదామని” అన్నాడు మోటారు సైకిలతను.

———————————

కస్టమర్‌ : ఒక ప్లేటు గారెలు పట్రావయ్య

వెయిటర్‌: ఇంకేం కావాలి సార్‌!

కస్టమర్‌: కాసేపాగి ఆ గారెలు గట్టిగా వుంటే ఒక సుత్తి పట్రా!

First Published:  4 May 2015 7:02 PM GMT
Next Story