స‌న్నీలియాన్ కు ఝ‌ల‌క్ ఇచ్చిన మోడ‌ల్ కైరాద‌త్…!

ప్రస్తుతం టాప్ హీరోయిన్ ల కంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది సన్నీలియోన్. సన్నీ గురించి ఏ విషయం అయినా బయటకి వస్తే చాలు, అది ఎంత పాపులర్ అవుతుందో అందరికి తెలిసిందే. మంచి కథ, స్టార్ లు ఉన్న సినిమాలు కూడా ఒక్కోసారి ఆడకపోవచ్చు కాని, సన్నీలియోన్ ఉన్న సినిమా మాత్రం అసలు ఏ విషయం లేకపోయినా కాని జనాలు చుసేస్తున్నానారు. దీనికి ‘రాగిని ఏం.ఏం,ఎస్.’,’ లీలా ఎక్ పహేలి’ సినిమాలే ఉదాహరణ.

సినిమా పరంగా చుస్తే మేటర్ లేకపోయినా కాని వసూళ్ళ విషయంలో బాగానే రాబట్టాయి.  దీంతో ఈ మ‌ధ్య సన్నీ పారితోషకం విషయంలో కొంచం డిమాండ్ చేస్తుందట. బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ ఏక్తా కపూర్ తీస్తున్న ‘ ఎక్ష్ ఎక్ష్ ఎక్ష్ ‘ అనే సినిమాలో సన్నీని అడిగితే ఏకంగా 5 కోట్లు అడిగిందట. దీంతో  ఏక్త క‌పూర్ కు షాక్ త‌గిలినంత ప‌ని అయ్యింద‌ట‌. ఎందుకంటే  స‌న్నీ క్రేజ్ ను వాడుకుని సినిమాను చాల త‌క్కువ బ‌డ్జెట్ లో చేసి..  భారీగా లాభాలు గ‌డిద్దామ‌ని చూస్తుంది ఏక్తా క‌పూర్.  ఇటువంటి నేప‌థ్యంలో  కేవ‌లం  స‌న్నీలియాన్ ఒక్క‌రికే 5 కోట్లు ఇస్తే బ‌డ్జెట్  పెరిగి  ఇబ్బంది అయ్యే అవ‌కాశం ఉంద‌నే ఆలోచన చేస్తున్నార‌ట‌.   మొత్తం మీద త‌నకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని  స‌న్నీలియాన్  రెమ్యునరేష‌న్ పెంచితే.. ఈ రూపంలో  స‌న్నీ స్థానంలో  కైరా ద‌త్ అనే మోడ‌ల్ కు  అవ‌కాశం ఇచ్చార‌ట ప్రొడ్యూస‌ర్ ఏక్తా.  మ‌రి క‌త్తిలాంటి ఫిగ‌ర్ అంటున్న కైరా ను  ఏం చేస్తుందో  ఏక్తా క‌పూర్…!