Telugu Global
Others

బుద్ధుని బోధ‌న‌లు ప్ర‌పంచానికి మార్గం:  మోదీ

అశాంతి, ఉగ్ర‌వాదంతో త‌ల్ల‌డిల్లుతున్న ప్ర‌పంచానికి బుద్ధుని బోధ‌న‌లు ప‌రిష్కారం చూపుతాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీ అన్నారు. బుద్ధ‌పూర్ణిమ సంద‌ర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్ర‌సంగించారు. బుద్ధుడు జ‌న్మించిన నేల నేడు ప్ర‌కృతి విప‌త్తుల కార‌ణంగా విల‌పిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పొరుగుదేశానికి సాయ‌మందించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని పిలుపునిచ్చారు. నేపాల్ క‌న్నీళ్లు తుడుస్తామ‌ని హామీ ఇచ్చారు. భార‌త్‌, నేపాల్‌లో సంభ‌వించిన భూకంపం వ‌ల్ల మ‌ర‌ణించిన వారి ఆత్మ‌ల‌కు శాంతి క‌ల‌గాల‌ని ఒక నిమిషంపాటు మౌనం వ‌హించారు. రాజ‌కుటుంబంలో […]

బుద్ధుని బోధ‌న‌లు ప్ర‌పంచానికి మార్గం:  మోదీ
X
అశాంతి, ఉగ్ర‌వాదంతో త‌ల్ల‌డిల్లుతున్న ప్ర‌పంచానికి బుద్ధుని బోధ‌న‌లు ప‌రిష్కారం చూపుతాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీ అన్నారు. బుద్ధ‌పూర్ణిమ సంద‌ర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్ర‌సంగించారు. బుద్ధుడు జ‌న్మించిన నేల నేడు ప్ర‌కృతి విప‌త్తుల కార‌ణంగా విల‌పిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పొరుగుదేశానికి సాయ‌మందించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని పిలుపునిచ్చారు. నేపాల్ క‌న్నీళ్లు తుడుస్తామ‌ని హామీ ఇచ్చారు. భార‌త్‌, నేపాల్‌లో సంభ‌వించిన భూకంపం వ‌ల్ల మ‌ర‌ణించిన వారి ఆత్మ‌ల‌కు శాంతి క‌ల‌గాల‌ని ఒక నిమిషంపాటు మౌనం వ‌హించారు. రాజ‌కుటుంబంలో జ‌న్మించిన బుద్ధుడు అన్నిసుఖాలు త్య‌జించి త‌న బోధ‌న‌ల‌తో ప్ర‌పంచానికి మార్గ‌ద‌ర్శిగా నిలిచాడ‌ని కొనియాడారు. ఇప్పుడు యావ‌త్ ప్ర‌పంచం ఆసియా అభివృద్ధి వైపు చూస్తోంద‌న్నారు. 21వ శ‌తాబ్దం ఆసియాదేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు.
First Published:  4 May 2015 8:57 PM GMT
Next Story