ప్రతినాయిక పాత్రలో జ‌య‌ప్ర‌ద‌..!

సీనియ‌ర్ న‌టి జ‌య‌ప్ర‌ద రెండేళ్ల త‌ర్వాత ఓ హిందీ సినిమా కోసం మ‌ళ్లీ కెమెరా ముందుకొస్తున్నారు. చివరి సారిగా జయప్రద‌ కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ర‌జ్జోలో నటించింది. తాజాగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ సంజ‌య్ శ‌ర్మ తెర‌కెక్కిస్తున్న ఒక చిత్రంలో “రాణి సాహేబా” అనే ఆధునిక రాణి పాత్ర‌లో జ‌య‌ప్రద నటించబోతున్నారట‌. అందంగా కనబడుతూనే ప్రతినాయిక ఛాయ‌లున్న కీలక‌ పాత్ర ఇది . ప్రేక్ష‌కుల అంచ‌నాలు రోజురోజుకి మారుతుండటంతో.  యువ న‌టీ న‌టులు కూడా ఎన్నో ప్ర‌యోగాలు చేయ‌డానికి  చొరవ చూపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జయప్రద‌ కూడా డైరెక్ట‌ర్ మీద న‌మ్మ‌కంతో ప్ర‌తినాయ‌కలున్న రోల్ చేయ‌డానికి అంగీక‌రించార‌ట. తాను ఇప్ప‌టి వ‌ర‌కు  ఈ త‌ర‌హా పాత్రలను చేయ‌లేదని ఆమె తెలిపారు.