Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి టైటిల్ పై కన్నేసిన సూర్య

తెలుగులో ఈమధ్య కాలంలో సరైన హిట్స్ కొట్టలేకపోయాడు సూర్య. అందుకే ఈసార తన కొత్త సినిమాకు చిరు టైటిల్ పెట్టాలని ఫిక్సయ్యాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సూర్య. ఈ సినిమాకు రాక్షసుడు అనే టైటిల్ పెట్టాలని ప్రాధమికంగా అనుకుంటున్నారు. 1986లో చిరంజీవి నటించిన హిట్ సినిమా టైటిల్ ఇది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ మూవీ టైటిల్ ను మళ్లీ వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాడు సూర్య. అంతేకాదు.. తన కొత్త సినిమాకు సంబంధించి ఏదో […]

చిరంజీవి టైటిల్ పై కన్నేసిన సూర్య
X
తెలుగులో ఈమధ్య కాలంలో సరైన హిట్స్ కొట్టలేకపోయాడు సూర్య. అందుకే ఈసార తన కొత్త సినిమాకు చిరు టైటిల్ పెట్టాలని ఫిక్సయ్యాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సూర్య. ఈ సినిమాకు రాక్షసుడు అనే టైటిల్ పెట్టాలని ప్రాధమికంగా అనుకుంటున్నారు. 1986లో చిరంజీవి నటించిన హిట్ సినిమా టైటిల్ ఇది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ మూవీ టైటిల్ ను మళ్లీ వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాడు సూర్య. అంతేకాదు.. తన కొత్త సినిమాకు సంబంధించి ఏదో ఒక ఈవెంట్ కు మెగాకాంపౌండ్ నుంచి ఎవరో ఒకర్ని ఆహ్వానించాలని కూడా అనుకుంటున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ కొత్త సినిమా ఆడియోను మే 8న విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగు వెర్షన్ ఆడియో రిలీజ్ కు కుదిరితే చిరంజీవి లేకుంటే బన్నీ, చెర్రీల్లో ఒకర్ని స్పెషల్ గెస్ట్ గా పిలవాలని అనుకుంటున్నారు. తాజా చిత్రంలో సూర్య సరసన నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు.
First Published:  5 May 2015 12:59 AM GMT
Next Story