Telugu Global
Others

కృష్ణాజిల్లా టిడిపిలో ముసలం

కృష్ణాజిల్లా టిడిపి అధ్యక్ష ఎన్నిక గందరగోళంగా తయారయింది. మంత్రులు దేవినేని ఉమా, సుజనా చౌదరిల మధ్య అధ్యక్ష ఎన్నిక వివాదం తీవ్రమైంది. ఇప్పటివరకు బచ్చుల అర్జనుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుందామనే దేవినేని ఉమా వ్యూహాన్ని కేంద్రమంత్రి సుజనా చౌదరి దెబ్బతీసాడు. బందరు టిడిపి పార్లమెంట్‌ సభ్యుడు కొనకళ్ళ నారాయణ సోదరుడు కొనకళ్ళ బుల్లయ్యను సుజనా చౌదరి తెరపైకి తెచ్చాడు. దీంతో ఇద్దరు మంత్రులు టిడిపి జిల్లా అధ్యక్ష పదవికోసం హోరాహోరీగా తలపడే అసాధారణ పరిస్థితి నెలకొంది. అధ్యక్షుని ఎంపిక […]

కృష్ణాజిల్లా టిడిపిలో ముసలం
X

కృష్ణాజిల్లా టిడిపి అధ్యక్ష ఎన్నిక గందరగోళంగా తయారయింది. మంత్రులు దేవినేని ఉమా, సుజనా చౌదరిల మధ్య అధ్యక్ష ఎన్నిక వివాదం తీవ్రమైంది. ఇప్పటివరకు బచ్చుల అర్జనుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుందామనే దేవినేని ఉమా వ్యూహాన్ని కేంద్రమంత్రి సుజనా చౌదరి దెబ్బతీసాడు.
బందరు టిడిపి పార్లమెంట్‌ సభ్యుడు కొనకళ్ళ నారాయణ సోదరుడు కొనకళ్ళ బుల్లయ్యను సుజనా చౌదరి తెరపైకి తెచ్చాడు. దీంతో ఇద్దరు మంత్రులు టిడిపి జిల్లా అధ్యక్ష పదవికోసం హోరాహోరీగా తలపడే అసాధారణ పరిస్థితి నెలకొంది. అధ్యక్షుని ఎంపిక వివాదం కావడంతో 6వతేది జరగాల్సిన ఎన్నిక కార్యక్రమాన్ని 13తేదీకి వాయిదావేసారు. వాస్తవానికి బచ్చుల అర్జునుడు ఎంఎల్‌సీ పదవి ఆశించాడు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అర్జునుడు పార్టీ ఆరంభంనుంచి పార్టీలో కొనసాగుతున్నాడు. ఆయన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని కొంతమంది ఆయనకు ఎంఎల్‌సీ పదవి రాకుండా జిల్లా పార్టీ కన్వీనర్‌ పదవితో సరిపెట్టారు.
దేవినేని అనుచరుడిగా వున్న అర్జునుడికి పార్టీలో ఏమాత్రం న్యాయం జరగడంలేదనే అసంతృప్తి తీవ్రంగా ఉంది. దీనితో బీసీలు కూడా తెలుగుదేశం పార్టీపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మంత్రి దేవినేని హవా తగ్గించడంకోసం మంత్రి సుజనా చౌదరి తన వ్యక్తిగా చెప్పుకునే కొనకళ్ళ బుల్లయ్యను తెరపైకి తెచ్చాడు. దీంతో జిల్లా టిడిపి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

First Published:  5 May 2015 1:04 PM GMT
Next Story