పరగడుపున నీళ్లు మేలు చేస్తాయి…

 పరగడుపునే మంచినీరు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య పరమైన ప్రయోజనాలున్నాయి. చాలా అనారోగ్య సమస్యలకు నివారిణిగా పనిచేస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. నిద్రలేవగానే ఒకటిన్నర లీటరు మంచినీరు సేవించాలి. ఆ తర్వాత గంటన్నర వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.
– పరగడుపునే ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగడం వల్ల పెద్దపేగు శుభ్రపడి పోషకాలను గ్రహిస్తుంది.
– కొత్త రక్తం తయారీకి, కండరాలలో కణాల వృద్ధికి దోహదపడుతుంది.
– కనీసం అరలీటరు నీటిని తాగినా మన శరీర మెటబాలిజం 24 శాతం మెరుగుపడుతుందని, తద్వారా బరువు తగ్గుతారని పరిశోధకులంటున్నారు.
– రక్త కణాలు శుద్ధి అవుతాయి. దాని వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. దాంతో శరీర ఛాయ ప్రకాశిస్తుంది.
– ఇన్‌ఫెక్షన్లు దరిచేరకుండా చేసే తెల్ల రక్త కణాలు ఉత్తేజితమవుతాయి.