ఉత్తమ విలన్ కు కూడా తప్పలేదు

సినిమా విడుదలైన తర్వాత కత్తిరింపులు చేయడం ఈమధ్య కామన్ అయిపోయింది. ఏముందిలే.. ఓసారి జనాలపైకి వదిలి చూద్దాం.. క్లిక్ అవ్వకపోతే అప్పుడు కొన్ని సీన్లు తీసేద్దాం అనే భావన సినిమావాళ్లలో బాగా కనిపిస్తోంది. జడ్జిమెంట్ సరిగ్గా లేకనో లేక అనుభవరాహిత్యమో తెలీదు కానీ.. విడుదలై నెగెటివ్ టాక్ వచ్చిన తర్వాత సన్నివేశాలు తొలిగిస్తున్నారు. అంత గెస్సింగ్ లేకుండా వీళ్లు సినిమాలు ఎలా తీస్తున్నారా అని ఆశ్చర్యం కూడా కలుగుతుంది కొన్ని సార్లు. అయితే కమల్ హాసన్ లాంటి ఆల్ రౌండర్ సినిమాకు కూడా ఈ కత్తిరింపులు ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. ఇంతకుముందే చెప్పుకున్నట్టు కమల్ కేవలం ఓ నటుడు మాత్రమే కాదు.. అన్ని విభాగాలపై పట్టున్న ఓ ఆల్ రౌండర్. అలాంటి హీరో సినిమా పక్కాగా ఉంటుంది. స్క్రీన్ ప్లే విషయంలో మరింత పక్కాగా ఉంటాడు కమల్. కానీ ఉత్తమ్ విలన్ విషయంలో మాత్రం ఆ లెక్కలు కాస్త తప్పాయి. తెలుగు వెర్షన్ కు కాస్త నెగెటివ్ టాక్ రావడంతో  సినిమాలో దాదాపు 20నిమిషాల నిడివి గల సన్నివేశాల్ని తొలిగిస్తున్నారు. మిగతా మేకర్స్ విషయంలో అనుభవం లేదు.. జడ్జిమెంట్ తెలీదు అనుకోవచ్చు. కానీ కమల్ సినిమాకు కూడా ఇలా జరగడం బాధాకరం.