Telugu Global
Others

హ‌ర్యానాలో గోవ‌ధ‌కు పాల్ప‌డితే ప‌దేళ్ళ జైలు

రాష్ట్రంలో గోవ‌ధ‌కు పాల్ప‌డేవారికి ప‌దేళ్ళ జైలు శిక్ష విధించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు హ‌ర్యానా ప‌శుసంవ‌ర్థ‌క శాఖ‌ మంత్రి ఓం ప్ర‌కాష్ ధ‌న్క‌ర్ తెలిపారు. గోవ‌ధ చేసేవారికి మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌ను ఆయ‌న ఖండించారు. ఈసారి అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌భుత్వం గో సంర‌క్ష‌ణ‌, గో సంవ‌ర్థ‌క బిల్లులు ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్టు చెబుతూ… వీటి ముసాయిదా త‌యారీ స‌మ‌యంలో దేశ‌వ్యాప్తంగా అమ‌లులో ఉన్న బిల్లుల‌ను ప‌రిశీలిస్తామ‌ని తెలిపారు. గో మాంస విక్ర‌యాన్ని హ‌ర్యానాలో నిషేదిస్తామ‌ని, క్యాన్ల‌లో స‌ర‌ఫ‌రా చేసే […]

రాష్ట్రంలో గోవ‌ధ‌కు పాల్ప‌డేవారికి ప‌దేళ్ళ జైలు శిక్ష విధించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు హ‌ర్యానా ప‌శుసంవ‌ర్థ‌క శాఖ‌ మంత్రి ఓం ప్ర‌కాష్ ధ‌న్క‌ర్ తెలిపారు. గోవ‌ధ చేసేవారికి మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌ను ఆయ‌న ఖండించారు. ఈసారి అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌భుత్వం గో సంర‌క్ష‌ణ‌, గో సంవ‌ర్థ‌క బిల్లులు ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్టు చెబుతూ… వీటి ముసాయిదా త‌యారీ స‌మ‌యంలో దేశ‌వ్యాప్తంగా అమ‌లులో ఉన్న బిల్లుల‌ను ప‌రిశీలిస్తామ‌ని తెలిపారు. గో మాంస విక్ర‌యాన్ని హ‌ర్యానాలో నిషేదిస్తామ‌ని, క్యాన్ల‌లో స‌ర‌ఫ‌రా చేసే గో మాంసం విక్ర‌యాల‌పై కూడా నిషేధం ఉంటుంద‌ని చెప్పారు. గో మాంసాన్ని ర‌వాణా చేసే వాహ‌నాల‌ను సైతం స్వాధీనం చేసుకునేలా చ‌ట్టం చేస్తామ‌ని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో గో సంర‌క్ష‌ణ‌, పాల ఉత్ప‌త్తిని అధికం చేయ‌డం ఈ బిల్లు ఉద్దేశ్య‌మ‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్రంలోని ఇళ్ళ‌ల్లో 18 ల‌క్ష‌లు, గోశాల‌ల్లో మూడు ల‌క్ష‌లు, ఇవికాకుండా మ‌రో ల‌క్ష‌న్న‌ర గోవులు బ‌య‌ట ఉన్నాయ‌ని చెప్పారు. హిందు సంప్ర‌దాయంలో పురాత‌న కాలం నుంచి గోవుల‌కు విశిష్ట స్థానం ఉంద‌ని, గోవుల‌ను ర‌క్షించుకోవ‌ల‌సిన బాధ్య‌త‌ను గుర్తు చేస్తూ ఇందుకోసం చ‌ట్టం చేయ‌ద‌ల‌చుకున్న‌ట్టు గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు. గో సంర‌క్ష‌ణ ప్ర‌ధాన‌మంత్రి మోడీ క‌ల‌ల ప్రాజెక్ట‌ని, గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గోవ‌ధ, గో మాంస నిషేధం అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చార‌ని… అందులో భాగంగానే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని మ‌రో మంత్రి రాంవిలాస్ శ‌ర్మ తెలిపారు.
First Published:  5 May 2015 5:31 PM GMT
Next Story