సింహం మరోసారి వెనక్కి తగ్గింది

బాలకృష్ణ తాజా సినిమాకు సంబంధించి మరో వార్త. ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. నిజానికి మే 1న విడుదల చేద్దామనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల మే 8కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు మే 8కి కూడా లయన్ థియేటర్లలోకి రావట్లేదు. తాజాగా మే 14కు సినిమాను వాయిదా వేస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
మూవీ ఎందుకిలా వాయిదాలు పడుతోందో ఎవరికీ అర్థంకావట్లేదు. చాలా మంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తికాలేదంటున్నారు. బాహుబలి సినిమాలా గ్రాఫిక్ హంగుల్లేవ్ లయన్ లో. కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ లో జాప్యం జరగడానికి వీల్లేదు. పైగా బాలయ్య ఇప్పటికే డబ్బింగ్ కూడా పూర్తిచేశాడు. అయితే మరికొందరి వాదన మాత్రం మరోలా ఉంది. లయన్ సినిమాకు సంబంధించి ఇంకా బిజినెస్ పూర్తికానందున రిలీజ్ డేట్ వాయిదా పడుతోందంటున్నారు. ఇందులో కూడా వాస్తవం కనిపించడం లేదు. ఎందుకంటే.. బాలయ్య పెద్ద హీరో. పైగా లయన్ కు ముందు లెజెండ్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన స్టార్. అలాంటి హీరో సినిమాకి బిజినెస్ ఆగిపోయే సమస్య ఉండదు. ఇంకేదో కారణం లయన్ సినిమాను వెనక్కి నెడుతోంది.