మరో సంచలనం రాబోతుందా..

అప్పుడెప్పుడో ఈరోజుల్లో సినిమాతో సంచలనానికి తెరతీశాడు దర్శకుడు మారుతి. అంత కంటే తక్కువ ఖర్చుతో ఓ సినిమా తీసి అంత భారీ హిట్ కొట్టలేం అని నిరూపించింది ఈరోజుల్లో మూవీ. తర్వాత ప్రేమకథాచిత్రమ్ తో మరో ట్రెండ్ సృష్టించాడు. తెలుగులో హారర్ కామెడీ సినిమాలకు ఆద్యం పోసింది ఆ మూవీ. ఇప్పుడు అదే దర్శకుడు మరో సంచలనానికి తెరలేపనున్నాడా.. అవుననే అంటోంది ఫిలింనగర్. ప్రస్తుతం మారుతి, హీరో నానితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కథపై ప్రస్తుతం చాలా ప్రచారం నడుస్తోంది. సినిమా కచ్చితంగా ట్రెండ్ సెట్టర్ అవుతుందని భావిస్తున్నారు చాలామంది. అటు కథలో కొత్తదనం లేకపోతే నాని నటించడు కాబట్టి మారుతి-నాని కలిసి సంచలనమే సృష్టిస్తారనే బజ్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి నాని డబ్బింగ్ చెబుతున్నాడు. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే.