స‌మంత ఈ సారైనా వాళ్ల‌ను మెప్పిస్తుందా ?

సాధార‌ణంగా ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ముఖస్తుతులు ఎక్కువ‌. సినిమా ఎంత చెత్త‌గా వున్న  ద‌ర్శ‌కుడి స‌న్నిహితులు డైరెక్టర్ ను పొగిడేస్తుంటారు. ఇక లోకేష‌న్ లో హీరో, హీరోయిన్స్  ఎలా చేసిన ఆహా.. ఓహో ..అద్భుతం  అంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచే్స్తుంటారు. ఇది నిజ‌మ‌నుకుని చాల మంది బోల్తా ప‌డుతుంటారు. అయితే స‌మంత మాత్రం త‌న‌కు  ఆహా ఓహోలు  వద్దంటుంది.  త‌ను చేసిన యాక్టింగ్ ను చూసి మంచిగా విమ‌ర్శించే వారంటేనే త‌న‌కు ఇష్ట‌మ‌ట‌.ఎందుకంటే.. హీరో  కేంద్రంగా చిత్రాలు వ‌స్తుంటాయి. హీరోయిన్ న‌ట‌న‌కు ఎక్కువ స్కోప్ ఉండ‌దు. గ్లామ‌ర్ డాల్ గా చూపించ‌డానికే అన్న‌ట్లు చేస్తుంటారు.  ఈ నిజాలపై  స‌మంతాకు అవ‌గాహాన వచ్చినట్లుంది.  త‌న న‌ట‌న‌..డాన్స్ గురించి  క్లారీటి ఇచ్చింది.
స‌మంత ఎప్పుడు త‌ను చేసిందే యాక్టింగ్ అని.. చేసిందే డాన్స్ అని ఫీల్ కాద‌ట. లోకేష‌న్ లో కూడా  త‌ను యాక్టింగ్ , డాన్స్ గురించి  యూనిట్ స‌భ్యులు ఏమ‌నుకుంటున్నారు అనే విష‌యాన్ని ఆరా తీస్తుంద‌ట‌. మంచి విమ‌ర్శ‌లు వినిపిస్తే ఆలోచ‌న చేసి ఆ దిశగా పొర‌పాట్లు స‌రిదిద్దు కోవ‌డానికి  ప్ర‌య‌త్నిస్తుంద‌ట‌. కెరీర్ పరంగా తెలుగులో ప్ర‌స్తుతం ప్రాజెక్ట్ లు ఏమి లేవు కానీ.. మ‌హేష్ బాబు స‌ర‌స‌న బ్ర‌హ్మోత్సవం చిత్రంలో న‌టించే అవ‌కాశం వుంద‌నే రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా  త‌న విమ‌ర్శ‌కులు ..సినిమా క్రిటిక్స్  అంద‌రు మెచ్చుకునే చిత్రం ఒక‌టి చేయ‌బోతున్న‌ట్లు తెలిపింది.ఆ సినిమా చేసిన త‌రువాత స‌మంత ఇలా కూడా చేయ‌గ‌ల‌దా అని ఆశ్చ‌ర్య ప‌డ‌టం ఖాయ‌మ‌ట‌.! సో న‌టిగా త‌న‌ను తాను స‌రికొత్త గా ఆవిష్క‌రించుకునే  ఆప‌రేష‌న్  స‌మంత ప్రారంభించింద‌న్న‌మాట‌.