ఆమే అంత‌రంగం నిప్పుల కొలిమి..!

అనుష్క‌.. ఆర‌డుగుల అందం.  కుర్ర కారు డ్రీమ్ గాళ్.  బాహుబలి ఫ‌స్ట్ లుక్ లో  అలాగే చూపించారు డైరెక్ట‌ర్ రాజ‌మౌళి. దేవ‌సేన గెట‌ప్ లో అనుష్క  లుక్ కు కుర్ర‌కారు ఫిదా అయ్యారు. క‌ట్ చేస్తే ప్ర‌స్తుతం బాహుబ‌లి చిత్రాల విడుద‌ల ప‌రంప‌రలో  భాగంగా ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి అనుష్క లో  రెండో కోణాని చూపుతూ ఒక చిత్రాన్ని విడుద‌ల చేశారు. ఈ లుక్ లో అనుష్క  క‌ళ్ల‌లో  నిప్పులు కొలిమి వున్న‌ట్లుంది.  ఏళ్ల త‌ర‌బ‌డి బందీగా అనేక చిత్ర హింస‌లు భ‌రించి.. త‌న అంత‌రంగం  నిప్పుల  శ్వాస‌తో మండుతున్న‌ట్లు చూపించారు.  త‌న అంత‌రంగం నివురు గ‌ప్పిన నిప్పులా మారుతుందా అనే అర్ధం ఈ ఫోటో గురించి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో   రాశారు.   ఈ నెల 31న   బాహుబ‌లి సినిమా ట్రైల‌ర్ రిలీజ్ కు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ లోపు రాజ‌మౌళి బాహుబ‌లి చిత్రంలో  మెయిన్ క్యారెక్ట‌ర్స్  యొక్క క్యారెక్ట‌రైజేష‌న్స్  విశేషాల పిక్చ‌ర్స్ తో    అబిమానుల‌కు సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో తెలియ చేసే ప‌నిని రాజ‌మౌళి విజ‌యవంతంగా చేస్తున్నారు. ఇదే వ‌ర‌స‌లో  రానా, త‌మ‌న్నాల పోస్ట‌ర్స్ కూడా వ‌స్తాయ‌ని ఆశించవ‌చ్చు మ‌రి.