Telugu Global
NEWS

ఆర్టీసీ స‌మ్మెలో 90 శాతం బ‌స్సులు

     ఏపీ, తెలంగాణ రాష్ర్టాలలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. బుధవారం తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు నిరసనకు దిగడంతో 90 శాతం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇరు రాష్ట్రాల్లో 23 వేల బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ యాజమాన్యానికి రూ.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నించిన యాజమాన్య వైఖ‌రిని విమ‌ర్శిస్తూ  కార్మికులు అడుగ‌డుగునా అడ్డుత‌గిలారు. బ‌స్సుల‌ను ఎలాగైనా న‌డ‌పాల‌న్న యాజ‌మాన్య వైఖ‌రిని ఆర్టీసీ ఉద్యోగులు […]

ఆర్టీసీ స‌మ్మెలో 90 శాతం బ‌స్సులు
X
ఏపీ, తెలంగాణ రాష్ర్టాలలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. బుధవారం తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు నిరసనకు దిగడంతో 90 శాతం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇరు రాష్ట్రాల్లో 23 వేల బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ యాజమాన్యానికి రూ.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నించిన యాజమాన్య వైఖ‌రిని విమ‌ర్శిస్తూ కార్మికులు అడుగ‌డుగునా అడ్డుత‌గిలారు. బ‌స్సుల‌ను ఎలాగైనా న‌డ‌పాల‌న్న యాజ‌మాన్య వైఖ‌రిని ఆర్టీసీ ఉద్యోగులు ప్ర‌తిఘ‌టించారు. తాత్కాలికంగా నియ‌మితులైన ఉద్యోగుల‌తో గొడ‌వ‌కు దిగి దుర్భాష‌లాడారు. ప్ర‌యాణికులు బాగా ఇబ్బందులు ప‌డుతున్నా ప‌ట్టించుకోకుండా త‌మ స‌మ్మెకే అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తూ నిర‌స‌న‌లు చేప‌ట్టారు. తిరుపతిలో తాత్కాలిక కండక్టర్‌, డ్రైవర్‌ ఉద్యోగాలకు వచ్చిన నిరుద్యోగులను ఆర్టీసీ కార్మికులు బలవంతంగా డిపో బయటకు పంపారు. ప్రకాశం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో కార్మికులు, తాత్కాలిక ఉద్యోగుల మధ్య వాదనలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. గొడవలకు కారణమైన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరి, హన్మకొండ డిపోల్లో గొడవ జరిగింది. నిరుద్యోగులు సర్టిఫికెట్లను ఆర్టీసీ కార్మికులు చించేశారు. నంద్యాల ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో కార్మికులు తాత్కాలిక డ్రైవర్‌పై దాడికి దిగారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలో బస్సును బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయగా కార్మికులు ధ్వంసం చేశారు.
ఆర్టీసీ యాజమాన్యం తో సహా తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలు సమ్మెను ఆపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే తప్ప సమ్మెను విరమించేది లేదని సంఘాలు తేల్చి చెప్పాయి. కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీలు వేశామని, వాటి నుంచి నివేదిక వచ్చిన అనంతరం పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఇరు రాష్ర్టాల రవాణాశాఖ మంత్రులు ఇచ్చిన హామీలు కార్మిక సంఘాలను తృప్తి పరచలేదు.
ఆర్టీసీ సమ్మెతో ఐదు రెట్లు పెరిగిన చార్జీలు
ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. వేసవి సెలవులకు తోడు పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు పెట్టుకున్న వారు అవస్థలు పడ్డారు. ఓ వైపు భానుడి భగభగలు.. మరోవైపు బస్సుల్లేక నడిరోడ్డుపై ప్రైవేటు వాహనాల కోసం గంటలకొద్దీ ఎదురుచూపులు… ఇలా ప్ర‌యాణికులు న‌ర‌క‌యాత‌న చూశారు. నానా ఇబ్బందుల పాలయ్యారు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో తొలి రోజు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలయ్యాయి. ఇదే అదునుగా ప్రజలను ప్రైవేటు వాహనాల వారు నిలువుదోపిడీ చేశారు. సాధారణ రోజుల కన్నా నాలుగు నుంచి ఐదు రెట్లు వసూలు చేసి ప్రయాణికులను పిండేశారు.
First Published:  6 May 2015 10:11 PM GMT
Next Story