Telugu Global
Others

రక్షణ చ‌ట్టంలో సవ‌ర‌ణ‌ల‌కు క్యాబినెట్ ఓకే

న్యూఢిల్లీ : ప్రజావేగుల రక్షణ చట్టం (విజిల్ బ్లోయర్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్) సవరణలకు కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. 2014 మే నెలలో రాష్ట్రపతి ఆమోదం పొందిన ఈ బిల్లును నేటికీ నోటిఫై చేయకపోవడంఫై సోనియాగాంధీ పార్లమెంటులో నిలదీసిన మరునాడే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత, వ్యూహాలు, శాస్త్ర, ఆర్థిక రంగాల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ప్రజావేగుల భద్రతకు మరింత భరోసా కల్పించేలా సవరణలు చేయాలని నిర్ణయించింది. […]

రక్షణ చ‌ట్టంలో సవ‌ర‌ణ‌ల‌కు క్యాబినెట్ ఓకే
X
న్యూఢిల్లీ : ప్రజావేగుల రక్షణ చట్టం (విజిల్ బ్లోయర్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్) సవరణలకు కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. 2014 మే నెలలో రాష్ట్రపతి ఆమోదం పొందిన ఈ బిల్లును నేటికీ నోటిఫై చేయకపోవడంఫై సోనియాగాంధీ పార్లమెంటులో నిలదీసిన మరునాడే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత, వ్యూహాలు, శాస్త్ర, ఆర్థిక రంగాల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ప్రజావేగుల భద్రతకు మరింత భరోసా కల్పించేలా సవరణలు చేయాలని నిర్ణయించింది. ఆర్టీఐ చట్టం 2015లోని సెక్షన్‌ 8(1) పరిధి నుంచి ఈ చ‌ట్టాన్ని తప్పించే అంశాన్నీ పరిగణలోకి తీసుకున్నారు. మంత్రి మండలి ఆమోదం నేపథ్యంలో ఈ సవరణల బిల్లును ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన ఈ బిల్లు విజిల్ బ్లోయర్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ 2014 అనడానికి బదులు, విజిల్ బ్లోయర్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ 2011 గా పొరపాటున ముద్రితమైంది. దీంతో ప్రస్తుతం నోటిఫై చేయాల్సిన అవసరం ఏర్పడింది.
First Published:  6 May 2015 8:03 PM GMT
Next Story