వ‌ర్మ గారి అమ్మాయి  జంతువులా చూస్తుందా..?

రామ్ గోపాల్ వ‌ర్మ‌.  ఆయ‌న‌తో ట్రావెల్ అవుతున్న అభిమానుల‌కు ఆ  పేరు ఒక డ్ర‌గ్.  ఆయ‌న చిత్రాలు  ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ ను ఇంప్రెస్ చేయ‌లేక పోవ‌చ్చు కానీ… శివ చిత్రం నుంచి ఆయ‌న‌ చిత్రాలు ఫాలో అవుతున్న ఫ్యాన్స్ మాత్రం క‌నీసం ఒక్కసారైన చూస్తారు.  ఆ విష‌యం ఆయ‌న‌కూ తెలుసు. ఇక త‌న చిత్రాల‌కు ప్ర‌చారం క్రియేట్‌ చేయ‌డంలో కూడా రామ్ గోపాల్ వ‌ర్మ నెంబ‌ర్ వ‌న్.  తాజాగా  త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని  క‌థ తో  365  పేరుతో సినిమా  చేశారు. ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్దం అవుతుంది.  365 సినిమాను  ప్రేమ‌, పెళ్లి ఎలిమెంట్స్ నేప‌థ్యంగా చేశారు.  పాతికేళ్ల వ‌ర్మ కెరీర్ లో  తొలిసారి ఈ స‌బ్జెక్ట్ ను డీల్‌ చేశారు.  అయితే ఈ సినిమా స్ర్కిప్ట్  కంప్లీట్ అయిన త‌రువాత త‌న కూతురును చూడ‌మ‌ని  ఇచ్చార‌ట.   త‌ను కొన్ని సూచ‌న‌లు చేసి.. పెళ్లి గురించి అంద‌రు త‌న‌లా ఆలోచించ‌ర‌ని చెప్పార‌ట‌….

   మ‌రి మీ అమ్మాయి  మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంద‌ని మీడియా వారు అడిగిన ప్ర‌శ్న‌కు  వ‌ర్మ‌ అటువంటి  బోరింగ్ క‌పుల్ ను ఇంత‌ర‌కూ త‌ను చూడ‌లేద‌ని చెప్పార‌ట‌.పంచ వ‌ర్ష ప్ర‌ణాళిక  మాదిరి ప్లాన్ చేసుకుని మ్యారేజ్ చేసుకుని హాయ‌గా గడుపుతున్నార‌ని  న‌వ్వుతూ చెప్పారట.‌  భార్య, భ‌ర్త‌లు గొడ‌వ ప‌డ‌కుండా వుంటే త‌న‌కు న‌చ్చ‌ద‌ట‌. వాళ్లు గొడ‌వ ప‌డుతుంటేనే త‌న‌కు కొత్త స్టోరీలైన్ దొరుకుతుంద‌ని చ‌మ‌త్క రించారు. అయితే వివాహాం   విష‌యాల్లో త‌న ఆలోచ‌న విధానం త‌న కూతురుకు న‌చ్చ‌క త‌న‌ను ఆల్మోస్ట్ జంతువులా చూస్తుంద‌ట‌. వ‌ర్మ అప్పుడుప్పుడు  తన‌మీద సెటైర్స్‌ వేసుకోవ‌డంలోకూడా ఘ‌నుడే!.