లారెన్స్ రేంజ్ పెరిగిందా..?

ముని సినిమా లారెన్స్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిందనే చెప్పుకోవాలి. అప్పటికే హారర్ సినిమాలు ఎన్ని వచ్చినా కాని, ఒక డిఫ‌రెంట్  కాన్సెప్ట్ తో ముని సినిమాని తీసాడు. అది ప్రేక్షకులు ఆదరించడంతో దానికి సీక్వెల్ గా కాంచన తీసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో లాభాలు కుడా బాగా వచ్చాయని చెప్పుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ముని-3 గా ‘గంగ’ ని విడుదల చేసి మరో విజయాన్ని అందుకున్నాడు. గంగ సినిమా చూసి సూపర్ స్టార్ రజినీ కాంత్ లారెన్స్ ని కలిసి అబినందనలు చెప్పాడట‌.  దీంతో రజినీ తో సినిమా అనే వార్త పూర్తిగా అబద్దం కాదు అని లారెన్స్ మాటల్లోనే తెలుస్తుంది. ‘రజని సర్ తో సినిమా చేస్తున్నాను అని సూటిగా చెప్పలేను కాని, దానికి అవకాశం మాత్రం లేకపోలేదు. రజని సర్ కోసం నా దగ్గర రెండు స్క్రిప్ట్ లు సిద్దంగా ఉన్నాయి. మరి వాటిలో ఏదైనా నచ్చితే అప్పుడే అన్ని విషయాలు బయటకి వస్తాయి’ అని చెప్పాడు. మరి అన్నీ కలిసి వస్తే తొందరలోనే వీరిద్దరి ప్రాజెక్ట్ కూడా ఒకే అవుతుందని అనుకోవాలి. మొత్తం దర్శకుడిగా  లారెన్స్   రేంజ్ ను ముని  చిత్ర సిరీస్ పెంచుతుంద‌నే అంటున్నారు క్రిటిక్స్. నిజ‌మే క‌దా.!  అన్న‌ట్లు .. ముని  సినిమాకు  మ‌రో సీక్వెల్  రానుంద‌నే టాక్ వినిపిస్తుందండోయ్..!