Telugu Global
NEWS

జూన్ 1న శాస‌న‌మండ‌లి స్థానాల‌కు ఎన్నిక‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల‌య్యింది. ఏపీలో నాలుగు, తెలంగాణ‌లో ఆరు స్థానాల‌కు ఈ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ఇందుకు సంబందించి ఈ నెల 14న నోటిఫికేష‌న్ విడుద‌ల‌వుతుంది. జూన్ ఒక‌టో తేదీన ఎన్నిక‌లు జ‌రిగే ఈ స్థానాల‌కు ఈనెల 21 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు ఈ నెల 25 వ‌ర‌కు గ‌డువు ఉంటుంద‌ని ఎన్నిక‌ల షెడ్యూల్‌లో వివ‌రించారు. ఎన్నిక‌లు జ‌రిగిన జూన్ ఒక‌టో తేదీనే కౌంటింగ్ కూడా నిర్వ‌హించి ఫ‌లితాలు కూడా […]

జూన్ 1న శాస‌న‌మండ‌లి స్థానాల‌కు ఎన్నిక‌లు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల‌య్యింది. ఏపీలో నాలుగు, తెలంగాణ‌లో ఆరు స్థానాల‌కు ఈ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ఇందుకు సంబందించి ఈ నెల 14న నోటిఫికేష‌న్ విడుద‌ల‌వుతుంది. జూన్ ఒక‌టో తేదీన ఎన్నిక‌లు జ‌రిగే ఈ స్థానాల‌కు ఈనెల 21 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు ఈ నెల 25 వ‌ర‌కు గ‌డువు ఉంటుంద‌ని ఎన్నిక‌ల షెడ్యూల్‌లో వివ‌రించారు. ఎన్నిక‌లు జ‌రిగిన జూన్ ఒక‌టో తేదీనే కౌంటింగ్ కూడా నిర్వ‌హించి ఫ‌లితాలు కూడా అదే రోజు ప్ర‌క‌టిస్తారు.
First Published:  7 May 2015 7:06 AM GMT
Next Story