అదే నిజ‌మ‌య్యింది..!

     ర‌జ‌నీకాంత్ కు ఓ హిట్ ప‌డాల్సిందే. ఈ విష‌యంలో ఎవ‌రికి సందేహాలు లేవు. హండ్రెట్ ప‌ర్సెంట్   హిట్ ప‌డాలి. ఈ విష‌యం మ‌న అరుణాచ‌లానికి తెలుసు. అందుకే ఈ సారి  సీనియ‌ర్ డైరెక్ట‌ర్స్ జోలికి వెళ్ల‌కుండా..  ఈ జ‌న‌రేష‌న్ ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇస్తున్నారు. అట్ట‌కత్తి, మ‌ద్రాస్ వంటి చిత్రాలు చేసిన డైరెక్ట‌ర్ రంజిత్  చెప్పిన క‌థ‌కు అంగీకారం తెలిపారు.   ఈ సినిమాను గ‌తంలో  ర‌జ‌నీకాంత్ తో పెద‌రాయుడు చిత్రం చేసిన  క‌లైపులి థాను ఈ సినిమాకు నిర్మాత‌…. ఏక కాలంలో త‌మిళ్‌, తెలుగు భాష‌ల్లో  ఈ చిత్రం ఉంటుంద‌ని  స‌మాచారం.
     గ‌త యేడాది  నుంచి ర‌జ‌నీకాంత్ కు బ్యాడ్ టైమ్ ప్రారంభం అయ్యింది. కొచ్చాడియ‌న్, లింగా చిత్రాలు రెండు  బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డ‌టంతో  ర‌జ‌నీకాంత్ మార్కెట్  డౌన్ ఫాల్ ప్రారంభం అయ్యింది. ముఖ్యంగా త‌న ఇమేజ్ కు  స‌రిప‌డ‌ని  కొచ్చాడియ‌న్ వంటి బొమ్మ‌ల చిత్రం చేయ‌డం ర‌జ‌నీకాంత్ చేసిన చారిత్రిక త‌ప్పిదంగా చెబుతున్నారు క్రిటిక్స్.   ర‌జ‌నీకాంత్  స్క్రీన్ మీద ఒక  కెర‌టం.. ఒక అగ్గి.. ఒక తుఫాన్.. అటువంటి హీరోను .. కొచ్చాడియ‌న్  పేరు తో  బొమ్మ‌ల చిత్రంగా చేసి ఆయ‌న అభిమానుల్ని తీవ్రంగా  నిరాశ ప‌రిచారు.   టోట‌ల్ గా యంగ్ డైరెక్ట‌ర్ తో హిట్ కొట్ట‌డానికే సూప‌ర్ స్టార్ టీమ్ రెడీ అవుతున్న‌ది. ఈ ఆప‌రేష‌న్ సూప‌ర్ స‌క్సెస్ కావాల‌ని కోరుకుందాం.