ఈ సారి ఆలియా భట్ పెళ్లి కధా….

ఆలియాభట్ పేరు ప్రతిరోజు సోషల్ మీడియాలో, వాట్సప్ లో జోక్స్ తో లేదంటే సినిమాలతోనో పాటలతోనో న్యూస్‌లో మారుమోగుతూనే ఉంటుంది. తాజాగా ఊహించని విధంగా ఈ ముద్దుగుమ్మ పెళ్ళీ చేసుకుందని ఓ ఫోటో ఇంటర్ నెట్లో గత రెండు రోజుల నుండి బాగా తిరుగుతుంది. . పెళ్లిదుస్తులు ధరించి, సహనటుడు సిద్ధార్థ మల్హోత్రాతో పాటు కారులో వెళ్తోన్న ఆ ఫొటోని చూసి ఆమె అభిమానులంతా అవాక్కయ్యారు. పైగా వీరద్దరి మధ్య ప్రేమ నడుస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ ఫోటో చూసిన వారందరు ఇది నిజమే అని అనుకున్నారు. కేవలం 23 ఏళ్లకే పెళ్ళేంటని బాధపడుతున్న అభిమానులకు అది నిజమైన పెళ్లి కాదని, కోకో కోలా యాడ్‌లోని షాట్ అని తెలిసి ఆమె ఫ్యాన్స్  ఊపిరి పీల్చుకున్నారట…