ఆఖ‌రు నిమిషంలో కోపైల‌ట్ మ‌న‌సు మార్చుకున్నాడా?

గ‌త మార్చిలో జర్మన్ వింగ్స్ ఎయిర్ బస్ ఏ320 విమాన దుర్ఘ‌ట‌న మ‌రో మ‌లుపు తిరిగింది. చివ‌రి నిమిషంలో కో పైలట్ ఆండ్రూ ల్యూబిట్ త‌న మ‌న‌సు మార్చుకున్నాడా? ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్న ఫ్రెంచ్ ఎయిర్ ఇన్వెస్టిగేష‌న్ సంస్థ విడుద‌ల చేసిన మ‌ధ్యంత‌ర నివేదిక ఇదే విష‌యాన్ని చెబుతోంది. విమానం కూలిపోయే 90 సెకండ్ల ముందు తిరిగి విమానాన్ని త‌న అదుపులోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని నివేదిక వెల్ల‌డించింది. విమానంలో బ్లాక్‌బాక్స్‌లో ఈ మేర‌కు చివ‌రి 90 సెకండ్ల‌ను తిరిగి త‌న అదుపులోకి తీసుకునేందుకు కో పైలట్ ఆండ్రూ ల్యూబిట్ ప్ర‌య‌త్నించాడ‌ని రికార్డ‌యింది. గ‌త మార్చి 24న బార్సిలోనా నుంచి జ‌ర్మ‌నీలోని డ‌స్సెల్ డార్ఫ్‌కు బ‌య‌ల్దేరిన జ‌ర్మ‌న్ వింగ్ విమానం కోపైల‌ట్ చ‌ర్య వ‌ల్ల మార్గ‌మ‌ధ్యంలో ఆల్ఫ్స్‌ ప‌ర్వ‌తాల్లో కూలిన విష‌యం తెలిసిందే. ఈ దుర్ఘ‌ట‌న‌లో 150 మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ద‌ర్యాప్తులో ప్ర‌మాదానికి కార‌ణం కోపైల‌ట్ అన్న విష‌యం తేలింది. నిజంగా విమానం అదుపులోకి వ‌స్తే ఎంత బాగుండేది?