Telugu Global
Cinema & Entertainment

డబ్బు మనిషిని ఆడిస్తుంది. దొంగాట!

ఈ దొంగాట మనిషైన వాడిదగ్గరే “money + she” ఉంటుందని కూడా చెప్తుంది.   ఆటలో మోసం, దగా, కుట్ర, కుతంత్రాలు వుంటాయి. తెలివీ బలమూ పోటీ పడతాయి. హింసకు పూనుకుంటాయి. కాని హింసకు బదులు హాస్యం ఆక్యుపై చేసిన చిత్రమిది. ఈ చిత్రంలో ట్విస్ట్ లూ టర్న్ లుకు లెక్కే లేదు, సినిమాటిక్ అని టిక్ పెట్టి సరిపెట్టుకోవచ్చు. డబ్బుకోసం సినిమా స్టార్ శృతి(మంచు లక్ష్మి)ని  యిద్దరు కుర్రాళ్ళు వెంకట్(అడవి శేషు), విజ్జు(మధు నందన్) కలిసి కాటమరాజు […]

డబ్బు మనిషిని ఆడిస్తుంది. దొంగాట!
X

ఈ దొంగాట మనిషైన వాడిదగ్గరే “money + she” ఉంటుందని కూడా చెప్తుంది. ఆటలో మోసం, దగా, కుట్ర, కుతంత్రాలు వుంటాయి. తెలివీ బలమూ పోటీ పడతాయి. హింసకు పూనుకుంటాయి. కాని హింసకు బదులు హాస్యం ఆక్యుపై చేసిన చిత్రమిది. ఈ చిత్రంలో ట్విస్ట్ లూ టర్న్ లుకు లెక్కే లేదు, సినిమాటిక్ అని టిక్ పెట్టి సరిపెట్టుకోవచ్చు.

డబ్బుకోసం సినిమా స్టార్ శృతి(మంచు లక్ష్మి)ని యిద్దరు కుర్రాళ్ళు వెంకట్(అడవి శేషు), విజ్జు(మధు నందన్) కలిసి కాటమరాజు (ప్రభాకర్) సాయంతో కిడ్నాప్ చేస్తారు. గుట్టుగా ఈ విషయాన్ని వుంచాలనుకుంటుంది శృతి తల్లి జ్యోతి లక్ష్మి (ప్రగతి). అందుకు ACP (పృథ్వి), US నుండి వచ్చిన ప్రైవేటు డిటెక్టివ్ బ్రమ్మి(బ్రహ్మానందం) పోటిపడి సాయపడతారు. అయితే కిడ్నాప్ చేసినముగ్గురు బ్రమ్మి ఇంట్లోనే దాచిపెడతారు. ఈ అమ్మాయిని చూసి బ్రమ్మి ఆశ్చర్యపోతే కిడ్నాపర్లు ఇక్కడ దాచారని చెబితే నమ్మేస్తాడు, కిడ్నాపర్లని పట్టుకోవడానికి కిడ్నాపర్లకే సహకరిస్తాడు. మొత్తానికి అసలు కిడ్నాప్ డ్రామా ఆడింది శ్రుతేనని ఇంటర్వెల్ కు అర్ధమవుతుంది.- ఆపైన అసలు కిడ్నాప్ డ్రామా ఆడించింది తల్లి జ్యోతి లక్ష్మియేనని కాటం రాజుని నియమించిందని చిక్కు ముడి వీడుతుంది. ఆతర్వాత బోలెడు ముడులు…విప్పుకుంటూ వెళ్ళాక డబ్బు చేరాల్సిన చోటికే చేరిందా? అనాధశరణాలయాన్ని ఆదుకోవాలన్న ఆశయం నెరవేరిందా? ఆటన్నాక గెలుపు ఓటములు వుంటాయి! డబ్బు అన్నాక చేతులు మారుతూ వుంటుంది!

రొటీన్ : బ్రమ్మి

ఫ్లాష్ : ఒక్కపాటలో లెక్కకుమించిన స్టార్స్.

ప్లస్: కెమేర పనితనం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , టైటిల్ సాంగ్, మంచు లక్ష్మి అభినయం

మైనస్: డబల్ మీనింగ్ డైలాగులు(జ్యోతి లక్ష్మి క్యారెక్టర్ కనిపిస్తే చాలు డబల్ మీనింగ్ ని దాటి సింగల్ మీనింగ్ ని ‘సింగల్ వేసుకోనేదాక’), కథ ఒకే జానరులో లేక పోవడం.

న్యూట్రల్ : దర్శకత్వం, మాటలు.

రేటింగ్: 2.5/5

First Published:  8 May 2015 4:43 AM GMT
Next Story