Telugu Global
Others

ఆర్టీసీపై అన్ని అబద్ధాలే

ఆర్టీసీ కార్మికులు కోరిన విధంగా జీతాలు పెంచాలంటే టిక్కెట్‌ రేట్లు విపరీతంగా పెంచాలంటున్న ప్రభుత్వ ప్రకటనలు అబద్ధం అంటున్నాయి కార్మిక సంఘాలు. ఆర్టీసీని ఏర్పాటు చేసినప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 211 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాయని, ప్రస్తుతం ఆర్టీసి ఆస్తుల విలువ 50 వేల‌ కోట్ల రూపాయిలని చెబుతూ ఆర్టీసీ నష్టాల్లో ఉందన్న వాదనను ఖండిస్తున్నారు. ఆంధ్రప్ర‌దేశ్ ప్రభుత్వం విమాన ఇంధనంపై ఒకశాతం, రైల్వేశాఖ వాడే డీజిల్‌పై నాలుగు శాతం అమ్మకం పన్ను విధిస్తూ […]

ఆర్టీసీపై అన్ని అబద్ధాలే
X
ఆర్టీసీ కార్మికులు కోరిన విధంగా జీతాలు పెంచాలంటే టిక్కెట్‌ రేట్లు విపరీతంగా పెంచాలంటున్న ప్రభుత్వ ప్రకటనలు అబద్ధం అంటున్నాయి కార్మిక సంఘాలు. ఆర్టీసీని ఏర్పాటు చేసినప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 211 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాయని, ప్రస్తుతం ఆర్టీసి ఆస్తుల విలువ 50 వేల‌ కోట్ల రూపాయిలని చెబుతూ ఆర్టీసీ నష్టాల్లో ఉందన్న వాదనను ఖండిస్తున్నారు.
ఆంధ్రప్ర‌దేశ్ ప్రభుత్వం విమాన ఇంధనంపై ఒకశాతం, రైల్వేశాఖ వాడే డీజిల్‌పై నాలుగు శాతం అమ్మకం పన్ను విధిస్తూ ఆర్టీసీ వాడే డీజిల్‌పై 30 శాతం అమ్మకం పన్ను విధించడం ఆర్టీసీని దెబ్బ తియ్యడానికి కాదా? అని నిలదీస్తున్నారు. ఒక్క ఏడాదిలో ఆర్టీసీ నుంచి వ్యాట్‌ ద్వారా 495 కోట్లు, వాహన పన్నుద్వారా 622 కోట్లు తరలించుకుపోతూ ఆర్టీసీని ఎలా నిర్వీర్యం చేస్తున్నారో వివరిస్తున్నారు. ప్రైవేట్‌ బస్సుల మీద కన్నా, ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల మీద ఎక్కువ పన్నులు విధించడం ఏవిధంగా సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందంటే దానికి కారణం ప్రభుత్వ విధానాలేనని, జీతాలు పెంచితే టిక్కెట్‌ ధరలు పెంచాల్సి వస్తుందనే వాదన అర్టీసీ కార్మికుల నుంచి సామాన్య ప్రజలను విడదీసే కుట్ర అని ఘాటుగా విమర్శిస్తున్నారు.
First Published:  8 May 2015 2:22 AM GMT
Next Story