మ‌ళ్లీ ఏ మాయ చేస్తారో..?

నాగ‌చైత‌న్య కెరీర్ లో  డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ తో చేసిన ఏ మాయ చేశావే చిత్రం నిస్సందేహాంగా ఒక మంచి చిత్ర‌మ‌ని చెప్పొచ్చు.  అటు నాగ చైత‌న్య కెరీర్ తో పాటు.. ఈ చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన స‌మంత  స్టార్ హీరోయిన్  కావ‌డానికి కూడా పునాది వేసింది. ఓ క్యూట్ ల‌వ్ స్టోరీతో  గౌత‌మ్ మీన‌న్ నిజంగా మాయ చేశాడు.  లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే..  గౌత‌మ్ మీన‌న్, నాగ‌చైత‌న్య మ‌రోసారి జ‌ట్టు క‌ట్ట‌డానికి రెడి అయ్యార‌ని.  ఈ మ‌ధ్య ఒక క‌థ‌ను నాగ చైత‌న్యకు ద‌ర్శ‌కుడు  గౌత‌మ్ మీన‌న్ వినిపించార‌ట‌. ఆ క‌థ చైతు కు బాగ న‌చ్చ‌డం ..సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్నెల్ ఇవ్వ‌డం జ‌రిగింది అనేది న్యూస్.  ఏ మాయ చేశావే సినిమా మాదిరి… ఇది కూడా ఒక ప్రేమ క‌థే అంటున్నారు. త్వ‌ర‌లోనే  ఈ సినిమా రెగ్యుల‌ర్ షూట్ ప్రారంభం కానుంద‌ని  నాగ చైత‌న్య స‌న్నిహితుల స‌మాచారం.  ఈ మ‌ధ్య వ‌చ్చిన దోచేయ్ చిత్రం నాగ‌చైత‌న్య కు   పెద్ద స‌క్సెస్ ఇవ్వ‌లేక పోయిన విష‌యం తెలిసిందే.