మ‌హేష్ లుక్ కొత్త‌గా ఉంటుందా..?

హీరోలు త‌మ అభిమానుల్ని ఇంప్రెస్ చేయ‌డానికి ఎప్ప‌టిక‌ప్పుడు లుక్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటుంటారు. రోటిన్ గా క‌నిపిస్తే ఫ్యాన్స్ అసంతృప్తికి ఫీల్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌నే భావ‌న హీరోల్లో ఎక్కువగా ఉంటుంది. ఇక అన్ని వ‌ర్గాల అభిమానుల్ని క‌లిగి వున్న హీరోల్లో మ‌హేష్ బాబు ఒక‌రు. బిజినెస్ మెన్ వంటి యూత్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసినా..వెంట‌నే సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు అంటూ ఫ్యామిలీ అభిమానుల్ని ధియేట‌ర్ కు ర‌ప్పించారు. తాజాగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో “శ్రీ‌మంతుడు” చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం రామోజి ఫీల్మ్ సిటిలో జ‌రుగుతుంది. ఈ చిత్రంలో మ‌హేష్ బాబు కొత్త లుక్ లో క‌నిపిస్తార‌ని ద‌ర్శ‌కుడు భ‌రోసా ఇస్తున్నారు. ఈ చిత్రంలో రాజేంద్ర ప్ర‌సాద్, జ‌గ‌ప‌తి బాబు ,కీల‌క రోల్స్ చేస్తున్నారు. దేవి శ్రీ సంగీతం అందిస్తున్నారు. మ‌రి గ‌త యేడాది ఆగ‌డు వంటి ఒక డిజాస్ట‌ర్ ఫిల్మ్ తో నిరాశ ప‌రిచిన మ‌హేష్ బాబు… శ్రీ‌మంతుడు చిత్రంతో ఖుషి చేస్తాడ‌ని ఆశిద్దాం.