ధోని భార్యగా కృతి సనన్..

భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జీవిత కథతో హిందీలో “ధోని ది అన్‌టోల్ట్ స్టోరీ” పేరుతో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. టైటిల్  రోల్ ను సుశాంత్‌సింగ్ రాజ్పుట్ పోషిస్తుండగా ధోని భార్య సాక్షి పాత్రకి కృతిసనన్ ను ఫైనల్ చేశారట. సినీపరిశ్రమకు టాలీవుడ్ చిత్రం “వన్” సినిమా ద్వారా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత  “హీరోఫంటీ” చిత్రంతో బాలీవుడ్ పరిశ్రమను ఆకర్షించింది. బాలీవుడ్ లో ఈ సినిమా విజయవంతం కావటంతో వరుస ఆఫర్లతో దిల్‌వాలే, ఫర్జీ చిత్రాల్లో కథానాయికగా నటిస్తుంది. కృతి సనన్ కన్నా ముందుగా ఈ చిత్రం కోసం ఆలియాభట్, శ్రద్ధాకపూర్ వంటి తారల పేర్లను పరిశీలించిన చిత్రబృందం చివరకు కృతిసనన్ను  ఒకే చెప్పేసారట…