Telugu Global
Others

డీహైడ్రేషన్ బారిన పడకుండా...

ఎండలు మండుతున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ డీహైడ్రేషన్ సమస్య ముంచుకొస్తుంటుంది. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.  -వేసవిలో నీరు ఎక్కువగా తాగాలి. తగినంత నీటిని తీసుకోవడంతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను తింటుండాలి.  – పాలకూరలో 95 శాతం నీరు ఉంటుంది. ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ కేలరీలు ఉంటాయి. ఒమెగా 3 […]

డీహైడ్రేషన్ బారిన పడకుండా...
X
ఎండలు మండుతున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ డీహైడ్రేషన్ సమస్య ముంచుకొస్తుంటుంది. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
-వేసవిలో నీరు ఎక్కువగా తాగాలి. తగినంత నీటిని తీసుకోవడంతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను తింటుండాలి.
– పాలకూరలో 95 శాతం నీరు ఉంటుంది. ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ కేలరీలు ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్, ఫైబర్, ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి.
– యాపిల్‌లో 86శాతం నీరు ఉంటుంది. ఫైబర్, విటమిన్ సి ఉంటుంది.
– క్యాలీఫ్లవర్‌లో పోషకాలతో పాటు 89శాతం నీరు ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వేసవిలో వచ్చే అనేక రకాల అలర్జీలు, ఇతర సమస్యలు రాకుండా చూస్తాయి.
– పెరుగులో 85 శాతం నీరుంటుంది. ప్రొబయోటిక్‌గా పిలిచే మైక్రో ఆర్గానిజమ్స్ వేసవి సమస్యలపై పోరాడతాయి. ప్రొటీన్, విటమిన్ బి, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి.
First Published:  7 May 2015 8:18 PM GMT
Next Story